విశాఖ కేంద్రంగా భారీ ఉద్యమాన్ని చేపట్టేందుకు జనసేన సిద్ధమవుతోంది.ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వానికి పవన్ డెడ్ లైన్ విధించారు.
గత నెల 31వ తేదీన విశాఖకు వచ్చిన పవన్ ఆ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న కార్మికులు, ఉద్యోగ సంఘాల కు మద్దతు పలికారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో పూర్తిగా వైసీపీ ప్రభుత్వానిదే తప్పని, ఆ పార్టీ గట్టిగా ఒత్తిడి చేయలేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని పవన్ విమర్శలు చేశారు.
వెంటనే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ వారం రోజుల గడువును పవన్ విధించారు.
ఆ గడువు లోగా వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే ఏం చేయాలో అదే చేస్తామంటూ పవన్ ప్రకటించారు.
ఆ విధంగా విధించిన గడువు రేపటితో ముగిసిపోతుంది.దీంతో ఈ విషయంలో జనసేన ఏ విధంగా ముందుకు వెళ్లబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
వైసీపీ ప్రభుత్వం మాత్రం పవన్ విధించిన డెడ్ లైన్ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.డెడ్ లైన్ విధిస్తూ పవన్ చేసిన ప్రకటన తరువాత వైసీపీ మంత్రులు జనసేన పై చేసిన విమర్శలు చూస్తేనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా వైసీపీ ప్రభుత్వం లేదా అనే విషయం అందరికీ అర్థమైపోయింది.

ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఏపీ బీజేపీ సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పోరాడుతాం అంటూ ప్రకటించింది.ఇది ఎలా ఉంటే ఇప్పుడు డెడ్ లైన్ ముగియగానే జనసేన వైసిపి వ్యతిరేక పార్టీలన్నింటికీ కలుపుకొని విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ప్రభుత్వానికి పవన్ విధించిన గడువు పూర్తి కాగానే ఈ లాంగ్ మార్చ్ పై ప్రకటన చేసే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
.