చేరికలపై తెగేదాకా లాగుతున్న కేటీఆర్ ?

నయానో.భయానో ఇతర పార్టీలోని నాయకులను తమ పార్టీలో చేర్చుకుని తామే బలవంతులం అనే విధంగా చెప్పుకునేందుకు ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

 Ktr In The Party Is Provoking Bjp, Ktr, Kcr, Telangana, Trs, Bjp, Bandi Sanjay,-TeluguStop.com

దీనిలో భాగంగానే టిఆర్ఎస్ నుంచి బిజెపి కాంగ్రెస్ లోకి,  కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి, బిజెపి నుంచి టిఆర్ఎస్ లోకి ఇలా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నాయకుల జాంపింగ్ లు గత కొద్ది రోజులుగా పెరిగిపోతున్నాయి.ప్రస్తుతం ప్రధాని పార్టీలన్నీ ఈ చేరికలపైనే దృష్టి సారించాయి.

తమ పార్టీలో చేరాలనుకున్న నాయకులకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ .ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజెపి నుంచి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ లోకి చేరికలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.ఇప్పటికే కొంతమంది కీలక నాయకులు బిజెపి నుంచి టిఆర్ఎస్ లో చేరారు.

  అలాగే హైదరాబాద్ ,  వరంగల్ కార్పొరేటర్లతో పాటు అనేక జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో బిజెపి కౌన్సిలర్లు టీఆర్ఎస్ లో చేరుతున్నారు.తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలో ఉండడం, పార్టీలోకి రావాల్సిందిగా ప్రలోభాలు,  బెదిరింపులకు పాల్పడుతూ ఉండడంతో పెద్ద ఎత్తున బిజెపి కౌన్సిలర్లు ఇతర నాయకులు టిఆర్ఎస్ కండువా కప్పుకుంటున్నారు అనే విమర్శలు వస్తున్నాయి.
 

Telugu Bandi Sanjay, Congress, Revanth Reddy, Telangana, Tpcc-Politics

 చేరికలను హైలెట్ చేసుకుంటూ బిజెపి బలహీనమవుతుందని,  అందుకే టిఆర్ఎస్ లో నాయకులు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారని కేటీఆర్ వంటి వారు గొప్పగా చెప్పుకుంటున్నారు.బిజెపిని టార్గెట్ చేసుకునే కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు.రాష్ట్ర , జాతీయ నాయకులు విమర్శిస్తున్నారు.జాతీయ కార్యవర్గ సమావేశాలపై దృష్టి సారించడంతో బిజెపి నుంచి టిఆర్ఎస్ లో వెళ్తున్న నాయకుల పెద్దగా రియాక్ట్ అవడం లేదు .అయితే బీజేపీ తలుచుకుంటే టిఆర్ఎస్ ను బలహీనం చేయడం , ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కీలక నాయకులను చేర్చుకోవడం కేంద్ర దర్యాప్తు సంస్థలను బూచిగా చూపించి టీఆర్ఎస్ లోకి ఉన్న నాయకుల వ్యాపార వ్యవహారాలను టార్గెట్ చేసుకుంటే భారీగానే వలసలు ఉండే అవకాశం లేకపోలేదు.ఈ విషయంలో అనవసరంగా రెచ్చగొడుతూ, తెగేదాకా లాగుతున్నారు అనే అభిప్రాయాలు అర్థం అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube