అటు బాబు యాత్ర ఇటు జగన్ యాత్ర .. షెడ్యూల్ ఇలా 

ఏపీలో ఎన్నికల వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతుంది.ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం అహర్నిశలు పాటుపడుతున్నాయి.

 Chandrababu S Trip And Jagans Trip The Schedule Is Like This, Jagan, Chandrababu-TeluguStop.com

గెలుపే లక్ష్యంగా అనేక వ్యూహాలను అమలు చేస్తూ, జనాల్లోకి వెళ్తున్నా యి.టిడిపి , జనసేన, బిజెపిలు ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తుండగా,  ఏపీ అధికార పార్టీ వైసిపి ఒంటరిగానే ఎన్నికలకు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ ఎన్నికల్లో తనతోపాటు జనసేన తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల తరఫున , ఆ తరువాత టిడిపి, బిజెపి కూటమికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా ప్లాన్ చేసుకున్నారు.

ఇక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu )నేటి నుంచి రెండో విడత ప్రజా గళం యాత్రను ప్రారంభించనున్నారు.

Telugu Ap, Chandrababu, Jagan, Jagan Schedule, Pawan Kalyan-Politics

ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ను ఖరారు చేసింది .ఈరోజు కొత్తపేట,  రామచంద్రపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.ఏప్రిల్ 4వ తేదీన కొవ్వూరు , గోపాలపురం లో రోడ్డు షోలు నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 5 న నరసాపురం,  పాలకొల్లు నియోజకవర్గాల్లో ప్రజాగణం యాత్ర చేపడుతారు.ఏప్రిల్ 6న పెదకూరపాడు , సత్తెనపల్లి నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు.

ఏప్రిల్ 7న పామర్రు , పెనుమలూరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నట్లుగా టిడిపి వర్గాలు పేర్కొన్నాయి.

Telugu Ap, Chandrababu, Jagan, Jagan Schedule, Pawan Kalyan-Politics

ఇక వైసిపి అధినేత సీఎం జగన్( CM Jagan ) విషయానికి వస్తే .ఏడో రోజు బస్సు యాత్రను ఈరోజు చిత్తూరు జిల్లాలో కొనసాగనుంది.  నిన్న రాత్రి అమ్మగారి పల్లెలో జగన్ బస చేశారు .ఇక్కడ నుంచి ఈ రోజు ఉదయం 9 గంటలకు బయలుదేరి సదుం, కల్లూరు మీదుగా దామలచెరువు,  తలుపులపల్లి మీదుగా తేనెపల్లి చేరుకుని భోజనం విరామానికి ఆగుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.ఆ తరువాత తేనెపల్లి , రంగంపేట క్రాస్ మీదుగా సాయంత్రం మూడు గంటలకు పోతలపట్టు బైపాస్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

అనంతరం పి కొత్తపేట , పాకాల క్రాస్,  గధంకి,  పనపాకం, ముంగిలి పట్టు, మామండూరు, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్, రేణిగుంట మీదుగా గురవరాజు పల్లి రాత్రి బస్సుకు చేరుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube