అటు బాబు యాత్ర ఇటు జగన్ యాత్ర .. షెడ్యూల్ ఇలా 

ఏపీలో ఎన్నికల వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతుంది.ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం అహర్నిశలు పాటుపడుతున్నాయి.

గెలుపే లక్ష్యంగా అనేక వ్యూహాలను అమలు చేస్తూ, జనాల్లోకి వెళ్తున్నా యి.టిడిపి , జనసేన, బిజెపిలు ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తుండగా,  ఏపీ అధికార పార్టీ వైసిపి ఒంటరిగానే ఎన్నికలకు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో తనతోపాటు జనసేన తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల తరఫున , ఆ తరువాత టిడిపి, బిజెపి కూటమికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా ప్లాన్ చేసుకున్నారు.

ఇక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu )నేటి నుంచి రెండో విడత ప్రజా గళం యాత్రను ప్రారంభించనున్నారు.

"""/" / ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ను ఖరారు చేసింది .

ఈరోజు కొత్తపేట,  రామచంద్రపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.ఏప్రిల్ 4వ తేదీన కొవ్వూరు , గోపాలపురం లో రోడ్డు షోలు నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 5 న నరసాపురం,  పాలకొల్లు నియోజకవర్గాల్లో ప్రజాగణం యాత్ర చేపడుతారు.ఏప్రిల్ 6న పెదకూరపాడు , సత్తెనపల్లి నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు.

ఏప్రిల్ 7న పామర్రు , పెనుమలూరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నట్లుగా టిడిపి వర్గాలు పేర్కొన్నాయి.

"""/" / ఇక వైసిపి అధినేత సీఎం జగన్( CM Jagan ) విషయానికి వస్తే .

ఏడో రోజు బస్సు యాత్రను ఈరోజు చిత్తూరు జిల్లాలో కొనసాగనుంది.  నిన్న రాత్రి అమ్మగారి పల్లెలో జగన్ బస చేశారు .

ఇక్కడ నుంచి ఈ రోజు ఉదయం 9 గంటలకు బయలుదేరి సదుం, కల్లూరు మీదుగా దామలచెరువు,  తలుపులపల్లి మీదుగా తేనెపల్లి చేరుకుని భోజనం విరామానికి ఆగుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఆ తరువాత తేనెపల్లి , రంగంపేట క్రాస్ మీదుగా సాయంత్రం మూడు గంటలకు పోతలపట్టు బైపాస్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

అనంతరం పి కొత్తపేట , పాకాల క్రాస్,  గధంకి,  పనపాకం, ముంగిలి పట్టు, మామండూరు, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్, రేణిగుంట మీదుగా గురవరాజు పల్లి రాత్రి బస్సుకు చేరుకుంటారు.

5 లక్షల నుంచి నాలుగు రోజుల్లో 500 కోట్ల కలెక్షన్ల స్థాయికి ఎదిగిన ప్రభాస్.. ఏం జరిగిందంటే?