మారుతి డైరక్షన్ లో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టే.ఓ పక్క మీడియం బడ్జెట్ తో సినిమాలు చేస్తూ అలరిస్తున్న మారుతి టైం దొరికితే చాలు స్మాల్ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నా మారుతి కరోనా లాక్ డౌన్ టైం లో మంచి రోజులు వచ్చాయి సినిమా కథ అనుకుని సినిమా తీసేశాడు.సంతోష్ శోభన్ హీరోగా మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించిన మంచి రోజులు వచ్చాయి సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మారుతి మరో హిట్ కొడుతున్నాడని అనిపిస్తుంది.
ముఖ్యంగా ఆడియెన్స్ కు ఏం కావాలో మారుతికి బాగా తెలుసు.
పెద్దగా అంచనాలు ఏమి లేకుండా వచ్చిన ఆడియెన్స్ కు మంచి ఎంటర్టైనర్ గా సినిమా అందిస్తే చాలు.అందుకే మారుతి సినిమాలకు డిమాండ్ ఎక్కువైంది.
మంచి రోజులు వచ్చాయి ట్రైలర్ చూస్తే సినిమా మంచి ఎంటర్టైనర్ గా అనిపిస్తుంది.సినిమాలో అజయ్ ఘోష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినట్టు తెలుస్తుంది.
మరి మారుతి చేసిన ఈ మంచి ప్రయత్నానికి ఎలాంటి ఫలితం వస్తుంది అన్నది చూడాలి.