ఈటల రాజేందర్ కామెంట్స్ దళిత వ్యతిరేకా నేనా.కేసీఆరా.
ఆలోచించండి.దళిత ముఖ్యమంత్రి అన్నాడు.
లేదంటే తల నరుక్కుంటా అన్నాడు.ఉప ముఖ్యమంత్రి పదవులు ఇద్దరికి ఇచ్చినట్లు ఇచ్చి తీసేశాడు.0.2 శాతం ఉన్న వాళ్ల కులపోళ్లు ముఖ్యమంత్రి పదవి సహా అనేక మంత్రి పదవులు ఆక్రమించుకుంటే.17 శాతం ఉన్న దళితులకు ఒకే పదవా? మూడెకరాల భూమి ఇవ్వలేదు.డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదు.
గుండెకాయలాంటి సీఎంవోలో ఒక్క దళిత, బీసీ, మైనార్టీ, గిరిజన ఐఏఎస్ ఆఫీసర్ ను పెట్టుకోలేదు.నేను లొల్లి చేస్తే ఈ మధ్యే రాహుల్ బొజ్జ అనే అధికారిని పెట్టుకున్నారు.
ఆకునూరి మురళీ అనే దళిత అధికారిని అవమానిస్తే రాజీనామా చేసి వెళ్లిపోయాడు.ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా.
కొట్లాడినా టీఆర్ఎస్ ను గెలిపించారు.
ఇప్పుడు కూడా దళితబంధు రావడానికి కారణమైన నాకు ఓటేస్తారా? కేసీఆర్ కు వేస్తారా? గడ్డిబండి కింద పోయే కుక్క.ఆ బండిని తానే లాక్కెళ్లుతున్నానని అనకుంటుందట యావత్ తెలంగాణ జాతి రాష్ట్రం కోసం కొట్లాడారు.మహిళలు బతకమ్మలు పోరాడితే, 1200 మంది ప్రాణ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది.
ఇలా మాట్లాడితే కేసీఆర్ కు కోపం రావచ్చు.కనీసం మంత్రులుగా కాకున్నా మనుషులుగా గుర్తించమని అడిగాం.
ఆయన ప్రజలనే కాదు.మమ్మల్ని కూడా కలవని పరిస్థితి వచ్చింది.
ప్రగతి భవన్ లోపలికి వెళ్లకుండా ఆపితే కళ్లనీళ్లు పెట్టుకుని బయటకు వచ్చాం.కేవలం పేదరైతులకే రైతు బంధు ఇవ్వాలని కోరాను.
పేదోడు లోన్ కోసం వెళ్తే ష్యూరిటీ ఉంటే తప్ప ఇవ్వరు.
కానీ నీలాంటి, నాలాంటి రైతులకు ఉత్త పుణ్యానికి పదిలక్షలు ఎందుకు ఇవ్వాలి? నా మీటింగులకు డప్పు కొట్టకూడదని, నా మీటింగ్ కు పోవద్దని ఆపడం, నేను పనిచేయలేదని చెప్పడం న్యాయమా? మొన్నటిదాకా నాపై నేనే దాడి చేయించుకుంటానని ప్రచారం చేసారు.ఇవాళ మళ్లీ… దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారిని నేను ఆత్మహత్యలకు పురికొల్పి చావు మీద సానుభూతి పొందుతానని అదే ఎమ్మెల్యే అంటున్నాడు.ఇలాంటి హింసల మధ్య ఐదు నెలలుగా గడుపుతున్నా.
నా భార్య మొత్తం ఆస్తి అమ్ముకోనైనా పోరాడమని చెప్పింది.ఆస్తి ఒక్కటే కాదు.
ప్రాణాలను కూడా ఫణంగా పెడుతా తప్ప.ఆయన ముందు మోకరిల్లేది లేదు.30 తారీఖు తర్వాత నాకేమీ పనిలేదు.ఆ తర్వాత నీ భరతం పట్టడమే నా పని.ఒక్క హుజారాబాద్ మాత్రమే కాదు.రాష్ట్రమంతా తిరుగుతా 20 ఏళ్లకు సరిపడా పనులన్నీ నా రాజీనామాతో పూర్తయ్యాయి.30 తర్వాత నా యుద్ధం.ఈ దుర్మార్గం మీద, అన్యాయం మీదనే.
నీవు నిజాం సర్కారు కాదు కేసీఆర్.నీకు కూడా ఇలాంటి గతి వస్తుంది
.