టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ కొండపొలం సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ ప్రకటన చేసి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్టు చెప్పుకొచ్చారు.అతనితో కలిసి దిగిన ఫోటోలను రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ నుంచి వచ్చిన ప్రకటనను చూసి షాకవ్వడం అభిమానుల వంతవుతోంది.సినిమా ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే నటీమణులలో రకుల్ ఒకరు కాగా నేడు రకుల్ పుట్టినరోజు కావడంతో తను ప్రేమించిన వ్యక్తి గురించి రకుల్ అభిమానులతో పంచుకున్నారు.
థ్యాంక్యూ మై లవ్.ఈ ఏడాది నేను అందుకున్న పెద్ద బహుమతివి నువ్వేనంటూ రకుల్ జాకీ భగ్నానీ గురించి చెప్పుకొచ్చారు.
తన లైఫ్ లో రంగులు నింపినందుకు, తనను నవ్విస్తున్నందుకు జాకీ భగ్నానీకి ధన్యవాదాలు అని రకుల్ చెప్పుకొచ్చారు.త్వరలో రకుల్ పెళ్లిపీటలెక్కబోతున్నారని ఆ రీజన్ వల్లే ప్రేమించిన వ్యక్తికి సంబంధించిన వివరాలను రకుల్ వెల్లడించారని ఆమె అభిమానులు భావిస్తున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపును సొంతం చేసుకున్న వశు భగ్నానీ తనయుడు జాకీ భగ్నానీ.
కోల్ కతాలో జన్మించిన జాకీ భగ్నానీ రెహ్నా హై తేరే దిల్ మే అనే మూవీతో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.ఈ సినిమాలో జాకీ భగ్నానీ గెస్ట్ రోల్ లో నటించారు.ఆ తర్వాత కల్ కిస్నే దేఖా అనే మరో సినిమాతో హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి జాకీ భగ్నానీ ఎంట్రీ ఇచ్చారు.
జాకీ భగ్నానీ పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించడం గమనార్హం.