తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారీ స్థాయిలో విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తమ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలల్లో టైంలోనే ప్రజలకు 202 ఎన్నికల హామీలు నెరవేర్చినట్లు.
సోషల్ మీడియాలో వీడియో సందేశం ద్వారా తెలియజేశారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే పార్టీ మొత్తం 505 ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగిందని వాటిలో ఇప్పటికే 202.అమలు చేసినట్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఐదు ముఖ్యమైన బిల్లులపై సంతకాలు చేసినట్లు స్పష్టం చేశారు.
వాటిలో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు అందరికీ నాలుగు వేల రూపాయలు.
అదేవిధంగా కరోనా సహకారం అందించటం ఒకటని.స్పష్టం చేశారు.
భారతదేశంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం కూడా.ఇంత వేగంగా.
ప్రజలకు ఇచ్చిన హామీలను.నెరవేర్చలేదని పేర్కొన్నారు.
ఈ రీతిలోనే ప్రతి మూడు నెలలకు ఒకసారి.తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ కలుస్తానని.
మెరుగైన పరిపాలన తమిళ ప్రజలకు అందించటమే తమ లక్ష్యమని సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.