అధికారంలో ఉన్నామన్న అహంకారంతో తమపై పెడుతున్న కేసులకు అధికార పార్టీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్ని విషయాలను గుర్తు పెట్టుకుంటున్నామని, సమయం వచ్చినప్పుడు బదులు తీరుస్తామంటూ వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ( TDP ) మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత.( Vangalapudi Anitha ) దివంగత నేత ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని భర్తను మామగారిని చిట్ఫండ్ కేసు విషయంలో ప్రభుత్వం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఆదిరెడ్డి భవానికి( Adireddy Bhavani ) సంఘీభావం తెలిపిన అనిత అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ….గెలిచే అవకాశం ఉన్న నేతలను పార్టీ మారాలని వేధిస్తున్నారని అందుకు ఒప్పుకోకపోవడంతో వారిపై అవినీతి కేసులు పెట్టి అరెస్టు చేస్తూ అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ

ఆమె వైసీపీ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు.కనీసం ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా సుమోటా గా తీసుకోవడానికి మీడియాలో ఒక వార్త కూడా రాకుండా ఉన్న ఈ విషయంలో ఈ ప్రభుత్వం అరెస్టులకు పాల్పడటం తీవ్ర అభ్యంతరకరం అన్న ఆమె ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిబంధనలను పక్కన పడుతున్న అధికారులకు కూడ తమ ప్రభుత్వం రాగానే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ములాకత్ లో ఆదిరెడ్డి అప్పారావు గారిని వాసు గారిని కలవడానికి అవకాశం ఇచ్చారనే కారణంతోనే అక్కడి సూపరెండేoట్ ను బదిలీ చేశారని ఆమె ఆరోపించారు.

దశాబ్దాలు తరబడి నిజాయితీగా వ్యాపారం చేస్తున్న కుటుంబంపై పార్టీ మార్పుకు అంగీకరించలేదు అన్న అక్కసుతోనే కేసులు పెట్టారని, మేము చేతులు ముడుచుకుని కూర్చోమని మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంతకీ ఇంత బదులు తీర్చుకుంటామని ఆమె చెప్పుకొచ్చారు.రాజకీయ దురుద్దేశాలతోనే వెనుకబడిన వర్గాలకు చెందిన రాజకీయ కుటుంబాన్ని ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించిన విషయం తెలిసిందే.పార్టీ తరఫున వారికి కావాల్సిన న్యాయ సహకారం అందిస్తామని కుటుంబానికి అండగా ఉంటామని ఆయన ప్రకటించారు
.






