హైదరాబాద్ ఉగ్రవాద కార్యకలాపాల కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా హైదరాబాద్, మధ్యప్రదేశ్ లో కలిపి మొత్తం 16 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు హైదరాబాద్ లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.వీరు అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ సలీం, షేక్ జూనైద్, మహమ్మద్ అబ్బాస్, హమీద్ లను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారిని భోపాల్ కు తరలించారు.ఐదుగురిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు భోపాల్ కోర్టులో హాజరుపరిచారు.
మరోవైపు పరారీలో ఉన్న మహ్మద్ సల్మాన్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.అదేవిధంగా పట్టుబడిన వారికి ఉజ్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.







