నాలుగో జాబితా విడుదల చేసిన వైసీపీ..!!

వైసీపీ( YCP ) పార్టీ వచ్చే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే.ఆ పార్టీ అధినేత సీఎం జగన్( CM Jagan ) పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 Ycp Released The Fourth List Details, Ap Cm Jagan, Ycp, Ycp Fourth List, Cm Jag-TeluguStop.com

ఈ క్రమంలో… సర్వేలు చేయించుకుని వాటి ఫలితాలు ఆధారంగా ఎంపిక చేస్తున్నారు.సర్వేలో వచ్చిన ఫలితాలు బట్టి స్థాన చలనం లేదా ఇన్చార్జిల మార్పు చేస్తూ ఉన్నారు.

ఎలాంటి మొహమాటానికి పోకుండా ప్రజా వ్యతిరేక కలిగిన సిట్టింగ్ లకి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేస్తున్నారు.

ఈ రకంగా మొదటి జాబితాలో 11 మంది రెండవ జాబితాలో 25 మంది మూడవ జాబితాలో 27 మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేయడం జరిగింది.చివరగా నాలుగో జాబితా( Fourth List ) నేడు రిలీజ్ చేయడం జరిగింది.ఈ నాలుగో జాబితాలో ఒక ఎంపీ, 8 ఎమ్మెల్యే స్థానాలకు కొత్త ఇన్చార్జిలను వైసీపీ ప్రకటించింది.ఐదుగురు సిట్టింగులు తిప్పేస్వామి(మడకశిర),( Thippeswamy ) పద్మావతి (సింగనమల), బుర్రా మధుసూదన్ యాదవ్(కనిగిరి), రక్షణనిధి (తిరువూరు),

ఆర్థర్ (నందికొట్కూరు) కు( Arthur ) స్థానం దక్కలేదు.చిత్తూరు ఎంపీ రెడ్డప్ప,( MP Reddappa ) జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి, గోపాలపురం, కొవ్వూరు ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావ్, తానేటి వనితకు( Taneti Vanitha ) స్థానచలనం కలిగించింది.ఇదే తుది జాబితా అని సమాచారం.దీంతో మొత్తం మీద ఇన్చార్జిల మార్పు స్థాన చలనం కింద నాలుగు జాబితాలలో కలిపి 50కి పైగా అభ్యర్థుల మార్పు వైసీపీ చేయడం జరిగింది.

ఇక జనవరి 25వ తారీకు నుండి జిల్లాల సమావేశాలలో వైయస్ జగన్ పాల్గొనడానికి రెడీ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube