పంజాబ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ చన్నీ నేడు ప్రమాణ స్వీకారం చేశారు.చరణ్ జిత్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది.
దళిత వర్గానికి చెందిన చరణ్ జిత్ కి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.పంజాబ్ రాష్ట్రంలో తొలిసారి దళిత వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావటం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కూడా చరిత్ర సృష్టించినట్లు అయింది.పరిస్థితి ఇలా ఉంటే మరో పక్క వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు.
జరగనున్నాయి.
ఈ తరుణంలో కాంగ్రెస్ హైకమాండ్ పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి సిద్దుని నియమించడంతో పంజాబ్ పొలిటికల్ మ్యాప్ ఒక్కసారిగా మారిపోయింది.అంతకు ముందు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వర్గానికి సిద్దు వర్గానికి మధ్య అనేక విభేదాలు రావడంతో ఇటీవల.ఎప్పుడైతే కాంగ్రెస్ హైకమాండ్ సిద్దూకి అధిక ప్రాధాన్యత ఇవ్వటం మొదలు పెట్టిందో.
పంజాబ్ కాంగ్రెస్ లో అనేక పరిణామాలు చోటు చేసుకోవడంతో.ఇంక నావల్ల కాదు నేను అవమానాలు భరించలేను అంటూ అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేశారు.
ఈ తరుణంలో పంజాబ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ చన్నీ నీ.కాంగ్రెస్ హైకమాండ్ నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు పంజాబ్ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.