సిరిసిల్ల కలెక్టరేట్లో పలు అంశాలపై ముగిసిన మంత్రి కేటీఆర్ రివ్యూ అనంతరం కలెక్టరేట్లో కేటీఆర్ ప్రెస్ మీట్ తెలంగాణ ఏర్పడిన ఏడున్నరేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో నేతన్నలకు అనేక కార్యక్రమాలు చేపట్టాం.ఇదే సమయంలోనూ మోడీ సర్కారు ఏర్పాటైంది.
ఇప్పటి వరకు కేంద్రం 7 బడ్జెట్లు పెట్టినా.ఒక్క విజ్ఞప్తిని కూడా కేంద్రం పట్టించుకోలేదు.
తెలంగాణలోని వస్త్ర పరిశ్రమకు, నేతన్నకు కేంద్రంగా అండగా ఉండే ప్రయత్నం చేయలేదు.ఫిబ్రవరి 1న మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్రంలోని చేనేత జౌళిశాఖా మంత్రిగా బండి సంజయ్ ను మరోసారి డిమాండ్ చేస్తున్నా.
ఈసారైనా చేనేత సమస్యలు పట్టించుకునేలా మాట్లాడాలి.వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత.
దేశంలోనే అతి పెద్దదైన మెగా టెక్స్ టైల్ పార్కును వరంగల్ లో ఏర్పాటు చేసాం.రెండు పెద్ద పరిశ్రమలు ఇప్పటికే అంగీకారాన్ని కుదుర్చుకున్నాయి.
కోవిడ్ వల్ల కొంత జాప్యం జరిగింది.కేంద్రం తెచ్చిన పీఎం మిత్ర పథకం కింద 897.92 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.దీనిపై ఇప్పటికే చాలా సార్లు నిర్మలా సీతారామన్ కు, ఇతర మంత్రులకు లేఖలు రాసాను.
పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, దుబ్బాక, కమలాపూర్, జమ్మికుంట, నల్లగొండ వంటి చేనేత సమూహాలకు చేనేత క్లస్టర్లు మంజూరు చేయాలి కోరాను ఇండియన్ ఇనిస్టిట్యూట్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనే సంస్థ ఉమ్మడి ఏపీలో ఉండేది.ఇది విభజన తర్వాత నెల్లూరు జిల్లాకు పోయింది.
కానీ తెలంగాణకు ఇలాంటి ఇనిస్టిట్యూట్ పోచంపల్లిలో ఏర్పాటు చేయాలని పలుమార్లు కోరాను.మళ్లీ కోరుతున్నా.
మరమగ్గాలకు, చేనేత మగ్గాల ఆధునికీకరణకు 50 శాతం కేంద్రం ఇస్తే, 50 శాతం మేమిస్తాం.నేషనల్ టెక్సటైల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తెలంగాణకు మంజూరు చేయాలని కూడా కేంద్ర మంత్రులకు లేఖ రాసాను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే సిరిసిల్ల కూడా ఉంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇక్కడ మెగా పవర్ లూం క్లస్టర్ ఏర్పాటు చేయాలని కాకిలాగా 8 ఏళ్లుగా అరుస్తున్నా పట్టించుకోవడంలేదు.
ఈ పార్లమెంట్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఇప్పటికైనా విమర్శలు మాని.తన పరిధిలో ఉన్న సిరిసిల్లకు మెగాపవర్ లూం క్లస్టర్ ఏర్పాటుకు కృషి చేయాలి.
ఇప్పటికైనా మంజూరు చేస్తారా? లేకుంటే ఏం చేయాలనేది ఆలోచిస్తాం.దేశంలోని అన్ని ప్రాంతాలను ఒకే విధంగా చూడాల్సిన బాధ్యత కేంద్రానిది.
దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్న రాష్ట్రం పట్ల వివక్ష తగదు.కేంద్రం ఇప్పటికైనా బడ్జెట్ లో నిధులివ్వాలి.
ఎనిమిదోసారి అడుగుతున్నా… ఓపిక నశిస్తే పోరాటానికి కూడా సిద్ధమవుతాం.మూడో వేవ్ తర్వాత రాజన్న సిరిసిల్ల లో కరోనా పరిస్థితులపై సమీక్ష చేసాను.
రెండో దశలో ఉన్నంత తీవ్రత, ఆక్సిజన్ సమస్య, వెంటిలేటర్ల సమస్య ఇప్పుడు లేదు.

పాజిటివ్ వచ్చినా… వ్యాధి తీవ్రత అంతగా లేదని వైద్యులు చెబుతున్నారు.వేములవాడలో కూడా వంద పడకల ఆస్పత్రి వచ్చింది.ఐదారుగురు మాత్రమే సిరిసిల్ల ఆస్పత్రిలో, ముగ్గురు-నలుగురు మాత్రమే వేములవాడ ఆస్పత్రిలో కోవిడ్ పేషెంట్లున్నారు.
ప్రజలందరినీ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం.రెండో దశ తీవ్రంగా ఉన్నప్పుడు ఔట్ సోర్సింగ్ తీసుకున్నాం.
ఇప్పుడు కూడా అవసరమైతే తీసుకోమని స్వేచ్ఛనిచ్చాం.వాక్సినేషన్ లో మన జిల్లా రాష్ట్రంలోనే టాప్ 5లో ఉంది.
ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఉద్యోగులకు బూస్టర్ డోస్ వెంటనే వేయించాలి.
ఫీవర్ సర్వే మొదలైంది.479 బృందాలు కలిసి ఐదారు రోజుల్లో లక్షకు పైగా ఇండ్లలో సర్వే చేస్తారు.అవసరమైన హోం ఐసోలేషన్ కిట్లు ఇస్తారు.
మందులు, ఇతర సౌకర్యాలు కావాలంటే అందిస్తాం.ఎక్కడా ఎలాంటి లోటు లేదు.
ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు సమకూర్చాం.హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టులో సిరిసిల్ల, ములుగు జిల్లాలు పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపికయ్యాయి.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉంది.సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో పెద్ద ఎత్తున ప్రసవాలు జరుగుతున్నాయి.
ఒకప్పుడు సర్కారు దవాఖానాకు పోవాలంటే భయపడేవారు.ఇప్పుడు సర్కారు దవాఖానాకే వస్తున్నారు.
దళితబంధు కార్యక్రమంపై కూడా సమీక్ష నిర్వహించాను.మార్చి 31 లోగా నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది.
సిరిసిల్ల జిల్లాలోని నియోజకవర్గాల్లోనూ దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్ ను ఆదేశించాను.జిల్లాలోని 510 పాఠశాలల్లో సౌకర్యాలపై కూడా సమీక్షించాను.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం బోధించాలని నిర్ణయించాం.డబుల్ బెడ్ రూం ఇండ్ల సమస్యకు కూడా పరిష్కారాలు చూపిస్తాం.