ఆఫ్ఘనిస్తాన్ దేశంలో దాదాపు 20 సంవత్సరాల తర్వాత తాలిబాన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఇటువంటి పరిస్థితుల్లో ఆప్ఘనిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు భారీగా జరుగుతాయని ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వస్తూ ఉన్నాయి.
వివిధ దేశాల నాయకులు కూడా ఈ విషయంపై ఇప్పటికే కామెంట్లు చేయడం జరిగింది.ఇటువంటి తరుణంలో తాజాగా ఈ విషయంపై తాలిబన్ ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి మొలావీ ఆమిర్ ఖాన్ ముత్తఖి స్పందించడం జరిగింది.
ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదులకు చోటులేదని.ఆ విషయంలో ప్రపంచ దేశాలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఎటువంటి పరిస్థితులలో కూడా ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులకు స్థావరంగా ఉండదని స్పష్టం చేశారు.

ఇక ఇదే తరుణంలో ఆఫ్గనిస్థాన్ దేశానికి సంబంధించిన అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు జోక్యం చేసుకోకూడదని, చేసుకోనివ్వము అని స్పష్టం చేశారు.ఈ సమయంలో మీడియా ప్రతినిధులు మహిళ విద్యపై అదే రీతిలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్నికలు ఉంటాయా అనే విషయంపై ప్రశ్నించగా వాటికి సమాధానం చెప్పలేదు. ఏది ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ లు తాలిబాన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం పై ప్రపంచవ్యాప్తంగా రకరకాల స్పందనలు వినబడుతున్నాయి.
ఎక్కువగా ఉగ్రవాదం మళ్లీ వ్యాపిస్తుందని.వివిధ దేశాల నాయకులు అంటున్నారు.
ఇటువంటి తరుణంలో తాలిబన్ ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి మొలావీ ఆమిర్ ఖాన్ ముత్తఖి ఇట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ లో చోటు లేదు అని వ్యాఖ్యలు చేయటం అంతర్జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.