అక్కడ గుడ్డి వారైన సరే అందాలను ఆస్వాదించవచ్చు.. ఎలాగంటే..?

మన ప్రకృతిలో ఉండే అందాలను, మన చుట్టూ ఉండే వివిధ రకాల జంతువులు, పక్షులను చూసి మనం పొందే ఆనందం అంతా ఇంతా కాదు.అయితే కళ్లు ఉన్నవాళ్ళ సంగతి ఓకే.

 Blind People Can Enjoy The Beauty There Anyway Viral Latest, News Viral, Socia-TeluguStop.com

ఎందుకంటే వాళ్ళు ఈ సృష్టిలో జరిగే ప్రతి విషయాన్నీ చూసి ఆస్వాదిస్తారు కాబట్టి.కానీ కళ్ళు లేని వారి పరిస్థితి ఏంటి అని ఒక్కసారి అయినా ఆలోచించారా.

వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏమి కనపడవు.ఒక్క చీకటి మాత్రమే వాళ్ళకి తెలుసు.

పగలు అనేది ఉంటుందని ఎవరో చెప్తే గాని వాళ్ళకి తెలియదు.వాళ్ళ జీవితం అంతా అలా అంధకారంలో గడిపేస్తారు.

మరి అలాంటి అంధులకు కూడా పెయింటింగ్ అంటే ఏంటో అని తెలిసేలా ఒక అందమైన మధురానుభూతిని కలిగించేందుకు డచ్ మ్యూజియం బ్లైండ్ స్పాట్ని ప్రత్యేకంగా అంధుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.

కళ్ళు కనిపించని వారు, దృష్టి లోపం సమస్యలు ఉన్నవారి కోసం మాత్రమే ప్రత్యేకంగా ఈ బ్లైండ్ స్పాట్ ని అందుబటులోకి తెచ్చారు.

అయితే డచ్ మ్యూజియంలో ఇప్పటికే కొన్ని పెయింటింగ్స్‌ ఉన్నాయి.మళ్ళీ వాటినే కొన్ని మార్పులు చేసి అంధులు అనుభూతి పొందేలాగా ఇక్కడ ప్రదర్శిస్తోంది.

నెదర్లాండ్స్‌ లోని అట్రెక్ట్ సెంట్రల్ మ్యూజియం ది బ్లైండ్ స్పాట్ పేరుతో ఓ పెయింటింగ్ ప్రాజెక్ట్ ను అంధుల కోసం అందుబాటులోకి తెచ్చారు .అయితే ఇక్కడ గల పెయింటింగ్స్ ను అంధులు శబ్దం, స్పర్శ, స్మెల్ లాంటి గుర్తులతో వాటిని ఆస్వాదించేలా వీటిని రూపొందించారు.అలాగే ఈ పెయింటింగ్స్ దగ్గర ఫ్రూట్స్, నట్స్, చీజ్, గ్రేప్స్, బన్స్ వంటి ఆహార పదార్థాలను ఫ్రేమ్‌ లో ఫిక్స్ చేసి ఉంచారు.ఒకవేళ కళ్ళు కనిపించే వ్యక్తులు కూడా ఈ మ్యూజియం సందర్శించాలంటే వాళ్ళు కూడా కళ్ళకి గంతలు కట్టుకుని గుడ్డి వాళ్ళ లాగానే ఈ ప్రాజెక్ట్ సందర్శించాలట.

Telugu Blind, Natural, Blind Spot, Latest-Latest News - Telugu

అలా అయితేనే బ్లైండ్ స్పాట్ లో ఉన్న ప్రత్యేకత గురించి తెలుస్తుంది అంట.ఇది ఒక గొప్ప ప్రయోగమని నిర్వాహకులు అంటున్నారు.వీటిని గుర్తించడం వల్ల అంధుల్లో ఆత్మ స్తైర్యం పెరుగుతుందని అక్కడ నిర్వాహకులు చెబుతున్నారు.అయితే ఈ మ్యూజియంకి వచ్చిన ఒక అంధుడు తన అనుభవాల గురించి ఇలా చెప్పుకొచ్చాడు.

ఇది నిజంగానే ఒక అద్భుతమైన అనుభవం.పెయింటింగ్స్ దగ్గర ఉన్న ఆహార పదార్థాల దగ్గరకు వెళ్లగానే వాసన వచ్చింది.

ఆ వాసన బట్టి అవి ఏంటో తెలుసుకున్నాం.అయితే అవి అలా గోడకు ఉండటంతో కాస్త పొరపాటు పడ్డాను కానీ వాటిని నా చేతితో తడిమి చూసాక గాని అర్ధం కాలేదు అని తెలిపాడు.

నిజంగానే ఇది ఇక సరికొత్త ప్రయోగం అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube