ట్రంప్ షాకింగ్ స్టేట్మెంట్ : తాలిబన్లు గొప్ప యోధులు...పోరాట ధీరులు...

అమెరికా మాజీ అధ్యక్షుడు తిక్కకు లెక్కే లేదన్న విషయం మరో సారి రుజువయ్యింది.ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదు.

 Donald Trump Says Taliban Fighting For 1000years, Joe Biden, Donald Trump, Talib-TeluguStop.com

అందుకే అమెరికా చరిత్రలో ఇలాంటి తిక్కల అధ్యక్షుడు మరొకడు లేడు, రాబోడు అంటుంటారు విమర్శకులు.ఇంతకీ మళ్ళీ ట్రంప్ తిక్క గూర్చి చర్చ ఎందుకు వచ్చిందనంటే గడిచిన కొన్ని రోజులుగా ఆఫ్ఘాన్ విషయంలో బిడెన్ తీరుపై విమర్శలు చేస్తున్న మాజీ అధ్యక్షుడు ట్రంప్ తాజాగా తాలిబన్లు గొప్ప పోరాట యోధులు అంటూ కితాబు ఇచ్చారు.


ఆఫ్ఘాన్ లో అమెరికా బలగాలను వెనక్కి తీసుకురావడంతో మళ్ళీ తాలిబన్లు రెచ్చిపోయారని, అక్కడి ప్రజలకు రక్షణ కరువైందని, బిడెన్ అతి చెత్త పనిచేశాడు, తాలిబాన్ల కు భయపడ్డాడు అంటూ విమర్శలు ఎక్కుపెడుతూ మీడియా కు ఇంటర్వ్యూలు ఇస్తున్న మాజీ అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో సారి బిడెన్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.బిడెన్ రాజీనామా చేయడానికి అర్హుడు అంటూనే తాలిబన్లు గొప్ప పోరాట యోధులు అంటూ కొతాబు ఇచ్చారు.

వాళ్ళు గొప్ప ఫైటర్లని, వారిని బిడెన్ ఎదిరించలేక పోయాడు అంటూ ఎద్దేవా చేశారు.

Telugu Afghanistan, Donald Trump, Donaldtrump, Joe Biden, Taliban-Telugu NRI

కోట్లాది రూపాయలు అమెరికా ఆఫ్ఘాన్ పై వెచ్చించిందని, ఎంతో మంది అమెరికా సైనికులు ఆఫ్గ్ఘాన్ లో ప్రాణాలు విడిచారని, ఆఫ్ఘాన్ నిర్మాణంలో అమెరికా క్రియాశీలక పాత్ర పోషించిన తరుణంలో ఇలా అక్కడి ప్రజలను వదిలేసి రావడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు.మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తాలిబన్లు నిజంగా గొప్ప ఫైటర్లు అంటూ పదేపదే వారిపై పొగడ్తల వర్షం కురిపించారు ట్రంప్.ఈ క్రమంలోనే ఎప్పటిలానే ట్రంప్ పప్పులో కాలేశారు తాలిబన్లు గడిచిన 1000 ఏళ్ళుగా పోరాడుతూనే ఉన్నారని వారిని మెచ్చుకోవాల్సిందేనని అన్నారు.

దాంతో సదరు ఛానెల్ వాళ్ళు షాక్ అయ్యారట.తాలిబన్ల కు 1000 ఏళ్ళ చరిత్ర ఎక్కడి నుంచీ వచ్చింది అంటూ ముఖాలు చూసుకున్నారట.ఇదిలాఉంటే ఉన్న పళంగా తాలిబన్లు గొప్ప పోరాట యోధులు అంటూ ట్రంప్ కితాబు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube