వావ్‌.. చెత్త సేక‌రించే ఈ బామ్మ ఎంత‌బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుందో..

అప్పుడ‌ప్పుడు కొన్ని వీడియోలు చూస్తే నిజంగానే షాక్ అనిపిస్తుంది.ఎందుకంటే మ‌నుషుల‌ను వారి వేష‌ధార‌ణ‌ను బ‌ట్టి వారి స్థాయిని అంచ‌నా వేస్తున్న ప్ర‌స్తుత స‌మాజంలో కూడా కొంద‌రు చూడ‌టానికి చాలా దారుణ ప‌రిస్థితుల్లో క‌నిపించినా కూడా వారి ట్యాలెంట్‌ను చూస్తే మ‌న మ‌తులు పోతుంటాయి.

 Wow How Well Does This Garbage Collecting Grandmother Speak English, Grandmother-TeluguStop.com

ఇక వారికి అస‌లు ఏమీ రాద‌నుకునేలోపే వారి ట్యాలెంట్తో అంద‌రినీ క‌ట్టిప‌డేస్తారు.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒక‌టి నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతూ ఉంది.

ఇక దీన్ని చూసిన వారంతా కూడా వావ్ అన‌డ‌మే వారి వంత‌యిపోతోంది.

అదేంటంటే ఓ మహిళ చూడ‌టానికి చెత్త ఏరుకునే మ‌హిళ‌గా క‌నిపిస్తోంది.

కానీ ఆమె మాత్రం చాలా అద్భుతంగా ఇంగ్లీష్ ఇర‌గ‌దీస్తోంది.అయితే అస‌లు విష‌యానికి వ‌స్తే ఆ మ‌హిళ ఇంత‌కు ముందు ఏడు సంవత్సరాల పాటు జపాన్‌లో ఓ కంపెనీలో జాబ్ చేశానని కానీ అక్క‌డి ప‌రిస్థితులు ప‌డ‌క ఇండియా వ‌చ్చేసిన‌ట్టు చెబుతోంది.

అందుకే తాను అంత బాగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాన‌ని వివ‌రించింది.కాగా ఈమె పిచ్చి ఉన్న మ‌హిళ‌గా అక్క‌డ అంతా అనుకునే వారంట‌.

ఎందుకంటే ఆమె చెత్త‌లో ఏవేవో వ‌స్తువులు ఏరుకుంటూ క‌నిపించేది.

ఇక నిత్యం ఈ మహిళ తన జీవిత కథకు సంబంధించిన విష‌యాల‌ను పాట రూపంలో పాడుకుంటూ తిరుగుతుండేద‌ని తెలుస్తోంది.ఈ కార‌ణంగానే అంద‌రూ ఆమెను పిచ్చిదానిలా అనుకుని పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదంట‌.కాగా ఆమె పేరు సిసిలియా మార్గరెట్ లారెన్స్ అని ఆమె మాట్లాడిన దాన్ని బ‌ట్టి చూస్తే అర్థం అవుతోంది.

ఇక ఆమె వీడియోను సచిన్ హాగర్ ఇన్ స్టా పోస్టు చేయ‌గా విప‌రీతంగా వైర‌ల్ అవుతోది.కాగా ఆ మ‌హిళ గురించి ఎవరైనా వెతుకుంటే ముందుగా తమను సంప్రదించాలంటూ కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube