జెఫ్ బెజోస్‌కు షాకిచ్చిన భారత సంతతి ఇంజనీర్.. బ్లూ ఆరిజిన్‌కు రాజీనామా, స్పేస్‌ ఎక్స్‌లో చేరిక

గత కొన్ని రోజులుగా అంతరిక్ష యాత్రలపై అన్ని దేశాల మీడియాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన కథనాలు వెలువడుతున్న సంగత తెలిసిందే.‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ సంస్థ అధినేత – బ్రిటీషర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌ జూలై 11న, అది జరిగిన సరిగ్గా తొమ్మిది రోజులకు జూలై 20న ఆ సంస్థకు బలమైన ప్రత్యర్థి ‘బ్లూ ఆరిజన్‌’ అధినేత– అమెరికన్‌ వ్యాపారి జెఫ్‌ బెజోస్‌ తమ బృందాలతో రోదసీ విహారం చేసి వచ్చారు.

 Indian-american Lead Engineer In Jeff Bezos Blue Origin Jumps Ship To Elon Musks-TeluguStop.com

వీటి గురించి ఇవాళ ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటోంది.త్వరలోనే ‘టెస్లా’ సంస్థ అధినేత ఎలన్‌ మస్క్‌ తన ‘స్పేస్‌ ఎక్స్‌’ సంస్థ జరిపేది మూడో రోదసి యాత్ర.

నిజానికి, ఇవన్నీ కుబేరుల మధ్య పోటాపోటీ రోదసీ యాత్రలు.ఒకరిపై మరొకరు ఎత్తులు వేసుకుంటూ పోటాపోటీగా అంతరిక్షయాత్రలు చేస్తున్నారు.

ఈ పరిస్ధితుల నేపథ్యంలో బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్‌కు షాకిచ్చాడు ఓ భారత సంతతి ఇంజనీర్.బ్లూ ఆరిజిన్‌లో లీడ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నితిన్ అరోరా… ఆ సంస్థను వీడి ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఆగస్టు 16న ఈ మేరకు తన లింక్డ్ ఇన్ ఖాతాలో .బ్లూ ఆరిజిన్‌తో బంధం తెంచుకున్నాని, స్పేస్ ఎక్స్‌లో చేరేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రకటించాడు.చంద్రుని మీదకు వ్యోమగాములను తీసుకెళ్లనున్న నాసా ప్రాజెక్ట్‌లో స్పేస్ ఎక్స్ 2.9 బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.అటు అరోరా నిష్క్రమణ బ్లూ ఆరిజిన్‌కు ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.ఈ సంస్థ చంద్రుని మీదకు పేలోడ్‌లను తీసుకెళ్లేందుకు తలపెట్టిన ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నాడు.దీనిని బ్లూ ఆరిజన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.

Telugu Blue Origin, Ellen Musk, Lander System, Indianamerican, Jeff Bezos, Linke

గత శుక్రవారం తనకు బ్లూ ఆరిజిన్‌లో చివరి రోజని నితిన్ అరోరా తెలిపారు.గత మూడేళ్లుగా ఎంతో తెలివైన, చురుకైన వ్యక్తుల మధ్య కలిసి పనిచేసే, వారిని నడిపించే అవకాశం తనకు లభించిన గౌరవంగా ఆయన చెప్పారు.తాను వారందరినీ మిస్ అవుతున్నట్లు అరోరా లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేశారు.

అలాగే స్పేస్ ఎక్స్‌లో చేరేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కాగా, ఫాల్కన్‌ ప్రయోగం విజయవంతమైన తర్వాత.

డ్రాగన్‌, క్రూడ్రాగన్‌ పేరిట స్పేస్‌ ఎక్స్‌ వ్యోమనౌకల్ని నిర్మించింది.క్రూ డ్రాగన్‌ ఇప్పటి వరకు రెండుసార్లు వ్యోమగాముల్ని విజయవంతంగా ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లింది.

మరోవైపు 2024లో చంద్రుడిపైకి చేపట్టనున్న మానవసహిత యాత్రకు అవసరమైన కీలక ‘హ్యూమన్‌ ల్యాండర్‌ సిస్టం’ నిర్మాణానికి స్పేస్ ఎక్స్‌తో నాసా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

Telugu Blue Origin, Ellen Musk, Lander System, Indianamerican, Jeff Bezos, Linke

ఈ కాంట్రాక్ట్ విషయమై నాసాకు అమెజాన్ అధినేత బెజోస్ బంపరాఫర్ ప్రకటించారు.ఆర్టిమస్‌ ఆస్ట్రోనాట్లు ప్రయాణించే వ్యోమనౌక (స్పేస్ క్రాఫ్ట్) తయారీ బాధ్యతలను తమకిస్తే 200 కోట్ల డాలర్ల ( భారత కరెన్సీలో రూ.14,898 కోట్లు ) డిస్కౌంట్ ఇస్తానని బెజోస్ ప్రకటించారు.అయితే స్పేస్ ఎక్స్ కు ఆర్బిటాల్ ప్రయోగాల్లో ఉన్న అపార అనుభవం, సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని ఎలన్ మస్క్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు నాసా సీనియర్ అధికారి కేథీ ల్యూడర్స్ చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube