ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు దేవర( Devara ).ఎన్టీఆర్ శివ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈనెల 27న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.కేవలం మరొక ఏడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ కూడా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.
దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా దేవర సినిమా మేనియానే కనిపిస్తోంది.ఇకపోతే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా తమిళ ప్రెస్ మీట్ లో మాట్లాడారు.తమిళ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.ఎన్టీఆర్ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అట్లీతోనూ ఫ్యూచర్ లో ఒక సినిమా ఉంటుందని స్వయంగా ప్రకటించారు.ఇంతకుముందు అట్లీతో ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన చర్చలు జరిగాయి.కానీ ఇద్దరికీ వేరువేరు కమిట్‌మెంట్స్ ఉన్న కారణంగా అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదంటూ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు.మరి అట్లీ తో ఎన్టీఆర్ అంటే ఇప్పట్లో అవుతుందా, ఎందుకంటే ఎన్టీఆర్ కు చాలా కమిట్ మెంట్స్ ఉన్నాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో దేవర 2 సినిమా ఉంది.
హిందీలో వార్ 2( War 2 ) సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమా కూడా ఉంది.మరో వైపు జవాన్ తర్వాత అట్లీ నెక్స్ట్ మూవీపై చాలా సస్పెన్స్ నడుస్తోంది.మొత్తానికి ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాల కోసం తమిళ్ డైరెక్టర్ లను లైన్ లో పెడుతున్నారని చెప్పాలి.
తన తదుపరి సినిమాలను కోలీవుడ్ డైరెక్టర్లు అట్లీ అలాగే వెట్రి మారన్లతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు ఎన్టీఆర్.ఏకంగా ఇంటర్వ్యూలో వెట్రిమారన్ డైరెక్ట్ గా ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉంది అన్నప్పటికీ అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయాన్ని బయట పెట్టారు ఎన్టీఆర్.