ఈ ప్రపంచంలో ఏ సినిమావుడ్ అయినా ఆడవాళ్లు లైంగిక వేధింపులకు అతీతం కాదని అనిపిస్తోంది.గత కొన్ని సంవత్సరాలుగా క్యాస్టింగ్ కౌచ్( Casting couch ) గురించి భిన్నమైన పరిశ్రమల నుండి ఇదే విషయంపైన మనం అనేక రకాల విషయాలను వింటున్నాము.
దానికి మన టాలీవుడ్ మినహాయింపేమీ కాదు.కోలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్… ఏ వుడ్ అయిన అదే వరస.ఆడది బయట పరిశ్రమలలోనే కాదు, ఇక్కడ కూడా ఓ అంగడి సరుకే.నిష్ఠురంగా అనిపించినా అదొక చేదు నిజం.
మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్టు ఓ కలకలం… మర్చిపోక మునుపే ఇక్కడ కూడా అలాంటి కేసులు సో కాల్డ్ బాబులను బెంబేలు పెట్టిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఓ హేమ కమిటీ( Hema Committee ) ఒకటి ఉండాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.కోలీవుడ్ హేమ కమిటీ అంటే హేమ అనే రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఏర్పడిన ఓ కమిటీ.అందులో సీనియర్ నటి శారదతోపాటు( senior actress Sharada ) రిటైర్డ్ ఐఏఎస్ వత్సల కుమారి కూడా ఉన్నారు.2017లో ఓ నటిపై జరిగిన లైంగిక దాడి తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అది.ఇక ఇక్కడి విషయానికొస్తే.తాజాగా కొరియోగ్రాఫర్, జనసేన నాయకుడు జానీ మాస్టర్( Johnny master ) తన అసిస్టెంటుకు చేసిన అన్యాయం టాలీవుడ్లో కలకలం సృష్టిస్తోంది.ఈ క్రమంలోనే ఇప్పుడిప్పుడే కొంతమంది నోళ్లు విప్పి మాట్లాడుతున్నారు.
నటి పూనం కౌర్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను( Actress Poonam Kaur ,Trivikram Srinivas ) కూడా బజారుకు లాగుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతోంది.
అయితే రాబోయే రోజుల్లో ఇలాంటి జానీ మాస్టర్లు అనేక మంది బయట పడబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఎందుకంటే.ఇక్కడ ఇలాంటి కామాంధులు కోకొల్లలు.
డబ్బుతోనో, వారి పరపతితోనో వారు తమని కప్పిపుచ్చుకోవచ్చు.కానీ కాలం వారికి సరియైన సమాధానం చెప్పకమానదని తాజా పరిణామాలే చెబుతున్నాయి.
ఇక జానీ మాస్టర్ అసిస్టెంటుకు ఓ నిర్మాణ సంస్థ, ఓ దర్శకుడు, ఓ సీనియర్ హీరో అండగా నిలబడటానికి ముందుకొచ్చారని వినికిడి.కానీ.
, ఎంతమంది అమ్మాయిలకు ఆయా సంస్థలు అండగా ఉంటాయి.పోనీ ఆ సో కాల్డ్ సంస్థ ఎమన్నా పతివ్రతనా? అక్కడే ఎక్కువగా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని గుసగుసలు వినబడుతున్నాయి.మొన్న బాలీవుడ్, నిన్న మోలీవుడ్, నేడు టాలీవుడ్.రేపు మరో వుడ్ పేరు వార్తల్లో రావచ్చు.అయితే సమాజంలో మేధావులుగా చలామణీ అయ్యేవారు ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ అనే నీచ సంస్కృతిని రూపుమాపితే అదే వీరు స్త్రీ జాతికి చేసిన మేలు అవుతుంది.లేదంటే వీరు ఒక అమ్మకి, అబ్బకి పుట్టినవాళ్ళే అయ్యి ఉండరు.