చైనా: ప్రెగ్నెంట్ లేడీపైకి దూకిన కుక్క.. ఓనర్‌కి ఫ్యూజులు ఔట్..?

చైనాలోని షాంఘై నగరంలో ఒక విషాద సంఘటన జరిగింది.యాన్ (41)( Yan ) అనే గర్భవతి ఊహించని విధంగా గర్భస్రావానికి గురయింది.

 Dog Attack, Pregnant Woman, Miscarriage, China, Shanghai, Ivf, Pet Laws, Legal C-TeluguStop.com

ఆమె తన ఇంటి ముందు వాకింగ్ చేస్తుండగా, ఒక గోల్డెన్ రిట్రీవర్ కుక్క ఆమెపైకి దూకింది.దీంతో ఆమెకు కడుపు భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చింది.

కొన్ని రోజుల తర్వాత యాన్‌కు గర్భస్రావం అయినట్లు తెలిసింది.ఈ విషాద సంఘటన ఆమెను తీవ్రంగా కలచివేసింది.

యాన్ చాలా కాలంగా బిడ్డ కోసం ప్రయత్నిస్తుంది.చివరకు ఈ ఏడాది ఆమె గర్భవతి అయింది.

కానీ ఒక కుక్క ఆమెపైకి దూకింది.దీంతో ఆమె గర్భం పోయింది.

ఇంటికి పార్సిల్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది.ఆ గర్భవతి కుక్కను చూసి భయపడి వెనక్కి జరిగింది.

ఆ ప్రభావంతో ఆమె వెన్ను, కడుపు భాగంలో నొప్పి కలిగింది.

“నాకు దాదాపు నాలుగు నెలల గర్భం. కుక్క భయపెట్టిన తర్వాత నా కడుపులో నొప్పి వచ్చింది.ఆస్పత్రికి వెళ్లాను కానీ, నా బిడ్డను కాపాడలేకపోయాను.

గర్భం దాల్చడం నాకు చాలా కష్టమైంది.మూడు సంవత్సరాలు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ( IVF ) చికిత్స చేయించుకున్నాను.ఇప్పుడు నాకు గర్భస్రావం అయింది, నేను చాలా బాధపడుతున్నాను.” అని ఆమె స్థానిక మీడియాకు తెలిపింది.

యాన్ ఆ కుక్క యజమాని లీపై కోర్టులో కేసు వేసింది. చైనా( China )లో, పెంపుడు కుక్కలను బహిరంగ ప్రదేశాలలో తీసుకెళ్ళేటప్పుడు గొలుసుతో కట్టాలని జంతు వ్యాధుల నివారణ చట్టం పేర్కొంది.ఆ సంఘటన సమయంలో యాన్‌కు కలిగిన శారీరక, మానసిక బాధకుగాను లీ 90,000 యువాన్‌లు (సుమారు 10,63,652.40 భారతీయ రూపాయలు) చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube