ఓపెన్ కాని పారాచూట్.. యూకే వీడియోగ్రాఫర్ విన్యాసం విషాదాంతం..

ఇంగ్లాండ్‌లో( England ) ఓ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది.హాంప్‌షైర్‌కు( Hampshire ) చెందిన 46 ఏళ్ల వయసు గల వీడియోగ్రాఫర్ సామ్ కార్న్‌వెల్ ఇటీవల ఒక పారాచూట్ ప్రమాదంలో చనిపోయారు.

 Skydiving Accident, England, Nri News, Sam Cornwell, Hampshire, County Durham, P-TeluguStop.com

ఆయన డ్యూరం కౌంటీలోని షాట్టన్ ఎయిర్‌ఫీల్డ్‌ సమీపంలో పారాచూట్ వేసుకొని జంపు చేశారు.పారాషూట్ ఓపెన్ కాలేదు.

దీంతో కిందపడి తీవ్ర గాయాలతో మృతి చెందారు.దక్షిణ పశ్చిమ పారిశ్రామిక ఎస్టేట్‌లో ఆయన చనిపోయినట్లు ప్రకటించారు.

ఈ ఘటన జరుగుతున్న సమయంలో, సామ్ మరో స్కైడైవర్‌ను చిత్రీకరిస్తున్నారు.సెప్టెంబర్ 16న క్రూక్ సివిక్ సెంటర్‌లో( Crook Civic Centre ) జరిగిన ప్రాథమిక దర్యాప్తులో, సామ్ ప్రధాన పారాచూట్ తెరుచుకున్నప్పటికీ, ముడుచుకుపోయి ఉపయోగపడని స్థితిలో ఉందని వెల్లడైంది.

ఆయన రిజర్వ్ పారాచూట్ కూడా పనిచేయకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది.ప్రమాద స్థలంలో కార్న్‌వెల్ ఒక చెట్టు కొమ్మకు చిక్కుకుపోయి ఉన్న భయంకరమైన దృశ్యాలు బయటపడ్డాయి.

Telugu County Durham, England, Hampshire, Nri, Sam Cornwell, Sky, Parachuteuk, F

డ్యూరం కౌంటీ కౌన్సిల్‌కు( Durham County Council ) చెందిన సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ ఆఫీసర్ జాన్ బోస్టాక్ ( Environmental Health Officer John Bostock )ఈ విషయాన్ని నిర్ధారించారు.సామ్‌ చనిపోవడానికి ముందు ఫిల్మ్ చేసిన స్కైడైవర్ వీడియో ఫుటేజీ తమ దగ్గర ఉందని తెలిపారు.ఆ రోజు ఉపయోగించిన అల్టిమీటర్, గోప్రో ఫుటేజ్, ఇతర పరికరాలపై విశ్లేషణ చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది.వీడియోలో దిగే వేగం అనుకోకుండా తగ్గుతూ ఉన్నట్లు కనిపిస్తోందని బోస్టాక్ తెలిపారు.

Telugu County Durham, England, Hampshire, Nri, Sam Cornwell, Sky, Parachuteuk, F

కరోనర్ జెరెమీ చిప్పర్‌ఫీల్డ్ ఒక జ్యూరీ ఈ కేసును పూర్తిగా విచారించాలని తెలిపారు.తదుపరి విచారణ 2025 జనవరి 14న జరగనుంది.సామ్ మరణించడంపై ఆయన సోదరి టోని బాధ వ్యక్తం చేశారు.ఆయన చాలా మందికి ప్రియమైన వ్యక్తి అని, ఆయన ఇకపై లేరు అనే నిజం చాలా బాధ కలిగిస్తుందని ఆమె చెప్పారు.

ఆయన స్నేహితుడు జెర్రీ మల్లన్, ఇంత మంచి వ్యక్తికి ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని అన్నారు.వృద్ధాప్యంలో కలిసి కూర్చుని కథలు చెప్పుకోవాలని కలలు కన్నామని ఆయన గుర్తు చేసుకున్నారు.

స్కై-హై స్కైడైవింగ్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేస్తూ, తమ ప్రతిభావంతులైన స్నేహితుడు, సహోద్యోగిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube