వైసీపీ అధినేత జగన్( Jagan Reddy ) లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.గతంలో మాదిరిగా కాకుండా ఇకపై నిత్యం జనాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
వైసీపీ ( YCP )ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ ప్రజలకు దాదాపు ఐదేళ్లపాటు దూరంగానే ఉన్నట్టుగానే వ్యవహరించారు. పార్టీ ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా జనాలు నేరుగా ఆయనను కలిసేందుకు , జగన్ జనాల్లోకి వెళ్లేందుకు అవకాశం ఉండేది కాదు.
ఏ పథకాన్ని ప్రారంభించినా బటన్ నొక్కి సరి పెట్టేవారు. తాను జనంలోకి వెళ్లినా, వెళ్లకపోయినా పాలనాపరమైన వ్యవహారాలన్నీ సజావుగా సాగుతున్నాయనే నమ్మకంతో ఉండేవారు.
దీనికి తగ్గట్లుగానే అధికారులు , పార్టీ కీలక నేతలు సైతం అంతా బాగుంది అన్నట్లుగానే జగన్ కు సమాచారం ఇచ్చేవారు.దీంతోపాటు జగన్ అధికారిక, పార్టీ కార్యక్రమాలు ఇలా ఎక్కడికి వెళ్ళినా చుట్టూ పరదాలు కట్టడం , చెట్లను నరికి వేయడం, జగన్ పర్యటించే ప్రాంతాల్లో ఎక్కడా జనాలు ఆయనను కలిసేందుకు అవకాశం లేకుండా చేయడం, ఇవన్నీ జగన్ కు, జనాలకు మధ్య దూరాన్ని పెంచాయి
ఈ విషయాన్ని 2024 ఎన్నికల్లో నిరూపితం అయింది. 175 కు కేవలం 11 స్థానాలను మాత్రమే వైసిపి గెలుచుకుంది.ఇక ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి జగన్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది ఇటీవల పిఠాపురం( Pithapuram ) పర్యటనకు వెళ్లిన జగన్ కు అక్కడ అపూర్వ స్వాగతం లభించింది.
భారీగా జగన్ ను చూసేందుకు జనాలు ఎగబడ్డారు.ఇక విజయవాడ వరదల సమయంలోను జగన్ బురద నీటిలో దిగి మరి వరద బాధితులను పరామర్శించారు.అక్కడ ఆయనకు జనాల నుంచి స్పందన బాగానే వచ్చింది.దీంతో ఇక పూర్తిగా జనాల్లోనే ఉండేలా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు.
జగన్ లో వచ్చిన ఈ మార్పును వైసిపి శ్రేణులు కూడా స్వాగతిస్తున్నాయి.
ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ ఆ సమయంలో మొండిగా వ్యవహరించారని, కేవలం కొంతమంది నాయకులకు బాధ్యతలు అప్పగించి అంత సవ్యంగా ఉందనే అభిప్రాయంతో ఉండేవారని , కానీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చిన తర్వాత వాస్తవం ఏమిటి అనేది జగన్ గుర్తించారాని ఇప్పటికైనా జగన్ వైఖరిలో మార్పు రావడం సంతోషమనే అభిప్రాయం జనాలలోను , పార్టీ నేతల్లోనూ కనిపిస్తోంది.