తెలుగు చలన చిత్రసీమలో చాలామంది నటులు మంచి గుర్తింపు సాధించినప్పటికీ కొంతమందికి మాత్రం ఎన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు అనేది రాదు.ఎందుకంటే వాళ్లకి తగ్గ క్యారెక్టర్ సినిమాల్లో పడకపోవచ్చు, అందుకే చాలా మంది నటులు వారిలో అద్భుతమైన నటన ప్రతిభ ఉన్నప్పటికీ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోలేక పోతున్నారు.
కొంతమంది మాత్రం హీరోలుగా ఇండస్ట్రీలో వెలిగిపోతూ ఉంటే కొందరు మాత్రం నటన బాగా వచ్చి కూడా సరైన క్యారెక్టర్ దొరక్క దానికోసం ఇంకా పరితపిస్తూ ఉంటారు.
అలాంటి వాళ్లలో నారాయణరావు ఒకరు ఆయన బిఎస్సి చదువుతున్నప్పుడు సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఇల్లు వదిలి మద్రాసుకి వచ్చి అక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తూ హోటల్లో సర్వర్ గా కూడా జైన్ అయ్యారు అలాంటి నారాయణ రావు ఇంట్లో విషయం తెలిసి వాళ్ల నాన్న నారాయణ రావు దగ్గరకు వచ్చారు.
నారాయణ రావు వాళ్ల నాన్న కూడా ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ గా మంచి గుర్తింపును సాధించిన వ్యక్తి.కానీ తన కొడుకు మాత్రం ఇండస్ట్రీకి రావడం తనకు ఇష్టం లేదు అందుకే నారాయణ రావు వాళ్ళ నాన్న తో చెప్పకుండా చెన్నై వచ్చి ప్రయత్నాలు మొదలు పెట్టాడు కానీ హోటల్లో సర్వర్ గా తన కొడుకు పని చేస్తున్నాడని తెలుసుకుని వాళ్ళ నాన్న వచ్చి అతన్ని ప్రోత్సహించి యాక్టింగ్ లో శిక్షణ కోసం ఇనిస్టిట్యూట్ లో జాయిన్ చేయించారు.
అక్కడ రజనీకాంత్ లాంటి వారితో నారాయణరావు శిక్షణ తీసుకున్నాడు.శిక్షణ అయిపోయిన తర్వాత వీళ్ళ ప్రతిభను చూడడానికి గెస్ట్ గా వచ్చిన బాలచందర్ గారు రజినీకాంత్, నారాయణ రావు ప్రతిభను చూసి మీకు తప్పకుండా నా సినిమాలో అవకాశం ఇస్తానని మాట కూడా ఇచ్చాడు మాట ఇచ్చినట్టుగానే తను తీసిన అంతులేని కథ సినిమాలో రజనీకాంత్, నారాయణరావు ఇద్దరికీ అవకాశం ఇచ్చాడు.
ఆ సినిమా మంచి సక్సెస్ అయింది అప్పట్లో చిరంజీవి, సుధాకర్, హరిబాబు, నారాయణ రావు నలుగురు ఒకే రూములో ఉంటూ సినిమా అవకాశం కోసం తిరిగేవారు.అంతులేని కథ సినిమా హిట్ అవడంతో నారాయణరావుకి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సినిమాలో అవకాశం వచ్చింది నారాయణ రావు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ తాళికట్టు శుభవేళ అనే సాంగ్ లో నటించిన వ్యక్తి అంటే మాత్రం అందరికీ తెలుస్తుంది.

అయితే ఒక ప్రముఖ దర్శకుడు తీసిన ఒక ఊరిలో అనే సినిమాలో నారాయణ రావు కి మంచి అవకాశం ఇచ్చాడు.నారాయణ రావు తనే స్వయంగా కొన్ని సినిమాలను కూడా తీశాడు అందులో దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు లాంటి సినిమాలు ఉన్నాయి.మెగాస్టార్ చిరంజీవి తీసిన హిట్లర్ సినిమాలో మంచి క్యారెక్టర్ పోషించి తనదైన నటనతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు.నారాయణ రావు తో ఫ్రెండ్స్ గా ఉన్న రజనీకాంత్ తమిళంలో సూపర్ స్టార్ అవగా, చిరంజీవి తెలుగులో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు నారాయణ రావుకి మాత్రం అవకాశాలు వచ్చినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి.
నవరసాల్ని అద్భుతంగా పండించే నారాయణ రావు పెద్ద యాక్టర్ కాలేకపోయాడు ఎందుకంటే తనకు తగ్గ క్యారెక్టర్ తనకి దొరకలేదని చెప్పాలి.
దాంతో నిదానంగా సినిమా అవకాశాలు తగ్గడం మొదలయ్యాయి.
అప్పుడు దేవదాస్ కనకాల గారు నడిపించే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో తనని ఫ్యాకల్టీగా చేయమని చెప్పి తీసుకున్నాడు నారాయణ రావు కొన్ని రోజులు అక్కడ యాక్టింగ్ క్లాసులు చెప్పి ఆ తర్వాత తను చేసేది ఇది కాదు అని అనుకొని మంచి యాక్టర్ గా గుర్తింపు పొందాలి అని మళ్ళీ అవకాశాలకోసం సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు అయినప్పటికీ తనకు యాక్టర్ గా పెద్దగా గుర్తింపు రాలేదు దాంతో సీరియల్లో నటించడం మొదలు పెట్టాడు.చాలా సీరియల్స్ లో మంచి క్యారెక్టర్లు పోషించాడు.
ప్రముఖ సినిమా దర్శకుడు అయిన కె.మధుసూదన్ రావు గారు స్థాపించిన మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో పూరి జగన్నాథ్ లాంటి గొప్ప దర్శకుడు శిక్షణ పొందాడు.ప్రస్తుతం నారాయణరావు మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఇన్ ఛార్జ్ గా, ఫ్యాకల్టీగా చేస్తూ అవకాశాలు వచ్చినప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నారు.