టాలీవుడ్ పాపులర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master ) కు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు సంచలన విషయాలను పేర్కొనగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని పోలీసులు చెప్పుకొచ్చారు.జానీ మాస్టర్ ఆమెను అసిస్టెంట్ గా చేర్చుకోవడం వెనుక దురుద్దేశం ఉందని పోలీసులు వెల్లడించారు.2020లో ముంబయిలోని ఓ హోటల్‌లో జానీ మాస్టర్ అసిస్టెంట్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పుకొచ్చారు.
లైంగిక దాడి జరిగిన సమయంలో బాధితురాలి వయస్సు 16 సంవత్సరాలు అని పోలీసులు చెప్పుకొచ్చారు.గత నాలుగు సంవత్సరాలుగా వేర్వేరు సందర్భాల్లో జానీ మాస్టర్ బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించారు.బాధితురలిని జానీ భార్య సైతం బెదిరించారని పోలీసులు పేర్కొన్నారు.విషయం బయటకు చెబితే సినిమా ఆఫర్లు రాకుండా చేస్తానని జానీ మాస్టర్ యువతిని బెదిరించారని పోలీసులు అన్నారు.
జానీ మాస్టర్ తన పలుకుబడితో యువతికి మూవీ ఆఫర్లు రాకుండా అడ్డుకున్నారని పోలీసులు కామెంట్లు చేశారు.జానీ మాస్టర్ బాధితురాలిని పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.జానీ మాస్టర్, అతని భార్య బాధితురాలి ఇంటికి వెళ్లి పలుమార్లు చెప్పుతో కొట్టారని తెలుస్తోంది.షూటింగ్ సమయంలో కూడా జానీ మాస్టర్ బాధితురాలిని ఇబ్బంది పెట్టాడని పోలీసులు రిపోర్ట్ లో పేర్కొన్నారు.
జానీ మాస్టర్ యువతిని పెళ్లి చేసుకున్నారంటూ పేర్కొనడం మాత్రం కొత్త విషయం అని ఒక విధంగా ఊహించని ట్విస్ట్ అని చెప్పవచ్చు.జానీ మాస్టర్ ఈ కేసులో ఇరుక్కున్నట్టే అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ కేసు విషయంలో జానీ మాస్టర్ కు కఠిన శిక్షలు పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.జానీ మాస్టర్ ఫ్యాన్స్ మాత్రం ఈ కేసు విషయంలో జానీ మాస్టర్ బయటపడాలని కోరుకుంటున్నారు.