ఎయిర్ ఇండియా సర్వీసుపై విమర్శలు గుప్పించిన ప్రైవేట్ కంపెనీ సీఈవో..(వీడియో)

అమెరికాలోని చికాగో నుంచి ఢిల్లీకి ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించిన ఓ ప్రైవేట్ కంపెనీ సీఈవో ఎయిర్ ఇండియా సర్వీసుపై( Air India service ) విమర్శలు గుప్పించారు.సాధారణంగా ఓమ్నీ బస్సులో( omni bus ) ప్రయాణించాలంటే వెయ్యి, రెండు వేలు చెల్లించి ఏసీ సరిగా లేకుంటే సీటు సరిగా రాకపోతే డ్రైవర్ ను తిడతాం.

 Social Media, Viral Video, Flight Video, Company Ceo-TeluguStop.com

అదే లక్షలు చెల్లించి టికెట్ కొనుక్కున్నప్పుడు ప్రయాణం బాగోలేకపోతే కోపం ఎలా వస్తుంది.ఆలోచించండి.

అలాంటి పరిస్థితే ఎదురైంది ఓ ప్రైవేట్ కంపెనీ సీఈవోకి.

అదేంటంటే.ఓ ప్రైవేట్ కంపెనీ సీఈవో పటేల్ చికాగో ( CEO Patel Chicago )నుంచి ఢిల్లీకి ఫస్ట్ క్లాస్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు.అతను ప్రయాణం చేయవలిసిన మొత్తం దూరం 12 వేల కి.మీ.అందుకు దాదాపు 15 గంటల ప్రయాణం పడుతుంది.ఇందుకోసం ఏకంగా టికెట్ కోసం మొత్తం రూ.5.19 లక్షలు చెల్లించాడు.అయితే , ప్రయాణం చేయాల్సిన రోజు రానే వచ్చింది.విమానంలో ఫస్ట్ క్లాస్ అద్భుతంగా ఉంటుందని ఊహించాడు.కానీ, ఈ పర్యటన ఆయన అంచనాలకు విరుద్ధంగా ఉంది.దీనికి కారణం అతనికి కేటాయించిన క్యాబిన్ చాలా శిథిలావస్థకు చేరుకుంది.అంతేకాకుండా కాస్త చెత్త చెల్లాచెదురుగా ఉంది.

అలాగే మ్యూజిక్ వినడానికి ఉపయోగించే హెడ్‌ఫోన్‌లు విరిగిపోయాయి.ఇదంతా అతను వీడియోగా రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఎయిరిండియా సర్వీసులో సాధారణంగా కొన్ని అవాంతరాలు ఉంటాయని, అయితే ఇంత ( Bad service )వస్తుందని తాను ఊహించలేదని పటేల్ తన వీడియోలో పేర్కొన్నాడు.వీడియోలోని ఆహారాన్ని ప్రస్తావిస్తూ, సాధారణంగా వడ్డించే ఆహారంలో 30% వడ్డించడం లేదని చెప్పాడు.అలాగే సమోసాలు, సూప్‌లు మధ్యస్తంగా బాగున్నాయని అన్నారు.ఇక వీడియో చుసిన నెటిజన్స్ ఫస్ట్ క్లాస్ అయితే అందులో అన్ని సౌకర్యాలు కల్పించాలి.ముఖ్యంగా కొనుగోలు ధరకు నాణ్యమైన సేవను అందించాలి.అయితే, వీడియో చూసిన చాలా మంది అలా చేయకపోవడం చట్ట ప్రకారం నేరమని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube