ఇటీవల సిద్ధార్థ్, అదితి రావు హైదరి( Siddharth , Aditi Rao Hydari )లు మూడు ముళ్ల బంధంతో ఒకటి అయిన విషయం తెలిసిందే.ఈ జంటకు సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.
సింపుల్గా అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు.ఇకపోతే సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరిలు తెలంగాణ వనపర్తి లోని శ్రీరంగాపూర్ లో ఉన్న రంగనాథ స్వామి దేవాలయంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా వీరిద్దరికి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.ఈ క్రమంలో సోషల్ మీడియాలో అదితి రావుకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి.అదితి మొదటి భర్త ఎవరు? అతడి బ్యాగ్రౌండ్ ఏమిటి అనే విషయాలను తెలుసుకునే పనిలో నెటిజన్లు నిమగ్నమయ్యారు.సినీ పరిశ్రమలో అడుగుపెట్టక ముందే అదితి రావు హైదరి సత్యదీప్ మిశ్రాను 2002 లో పెళ్లి చేసుకుంది.దాదాపు పదేళ్ల పాటు కలిసి జీవించిన వీరిద్దరు 2012 లో విడిపోయారు.
సత్యదీప్ మి( Satyadeep Misra )శ్రా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ గా, కార్పొరేట్ లాయర్ గా కూడా పనిచేశారు.ఆ తరువాత ఆయన ముంబైలో అడ్వర్టైజింగ్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించారు.
చిల్లర పార్టీ అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు.సినిమాల ద్వారా గుర్తింపు రాకపోవడంతో ఓటీటీ బాట పట్టారు.పలు వెబ్‌సిరీస్‌ల్లో కూడా నటించారు.
కాగా సత్యదీప్ మిశ్రా, అదితితో విడిపోయాక బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురు మసాబా గుప్తాను పెళ్లి చేసుకున్నాడు.కాగా వీరిద్దరికి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.
అయితే తాజాగా అదితి కి పెళ్లి అయిన సందర్భంగా తన మాజీ భర్త పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్స్.దీంతో ఈ విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది.