భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్ సారథ్యంలోని న్యూడెమొక్రాటిక్ పార్టీ (ఎన్డీపీ) ( New Democratic Party )తన మద్ధతును ఉపసంహరించుకోవడంతో కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో పడింది.దీంతో అక్కడ ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం నడుస్తోంది.
తన ప్రభుత్వ విశ్వసనీయతను , బలాన్ని నిరూపించుకునేందుకు ట్రూడో వచ్చేవారం విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నారు.ఇందులో ఆయన గెలుస్తారా లేక ప్రభుత్వం కుప్పకూలుతుందా అని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ బుధవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.ప్రధాని ట్రూడో, ప్రభుత్వంపై సభకు విశ్వాసం లేదని అందులో పేర్కొంది.
సభలో అధికార లిబరల్ పార్టీ( Liberal Party ) బలం 154 కాగా.కన్జర్వేటివ్‌లకు 119 మంది సభ్యుల బలం ఉంది.అయితే విశ్వాస పరీక్ష సందర్భంగా వేర్పాటువాద బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీ లిబరల్స్‌కు అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.అవిశ్వాస తీర్మానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని బ్లాక్ నేత ఫ్రాంకోయిస్ బ్లాంచెట్ బుధవారం మీడియాకు తెలిపారు.
క్యూబెక్‌లోని ఫ్రాంకోఫోన్ ప్రావిన్స్‌కు స్వాతంత్య్రానికి మద్ధతుగా నిలబడే బ్లాక్ పార్టీ.విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు గాను ట్రూడో ప్రభుత్వం నుంచి కొన్ని ప్రయోజనాలను ఆశిస్తోంది.
బ్లాక్ పార్టీకి సభలో 33 మంది సభ్యుల బలం ఉండటంతో అలవోకగా గట్టెక్క వచ్చని ట్రూడో భావిస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం 2025 అక్టోబర్‌లో కెనడా ఫెడరల్ ఎన్నికలు జరగనుండగా.కన్జర్వేటివ్‌లు ( Justin Trudeau )వాటిని ముందుగానే తీసుకురావాలని ఫోకస్ పెట్టారు.పబ్లిక్ ఏజెన్సీ అంగస్ రీడ్ ఇన్స్టిట్యూట్ (ఏఆర్ఐ) ఓటర్ ట్రాకర్ ప్రకారం.
దేశంలో ముందస్తు ఎన్నికలు జరిగితే కన్జర్వేటివ్‌లకు 43 శాతం మంది అండగా నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పింది.ఇది లిబరల్స్ కంటే 22 పాయింట్లు అధికం.నవంబర్ 2015లో తొలిసారిగా అధికారాన్ని అందుకున్న జస్టిన్ ట్రూడో నాటి నుంచి ఏకధాటిగా కెనడాను పాలిస్తున్నారు.అయితే ఈసారి ప్రభుత్వంపై వ్యతిరేకత, అధిక ధరలు, గృహ సంక్షోభం వంటి పరిణామాలతో లిబరల్స్ ఓడిపోతారని ముందస్తు సర్వేలు చెబుతున్నాయి.