టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో ఎన్టీఆర్ (NTR) ఒకరు.ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
ఈయన బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి వచ్చి అనంతరం హీరోగా అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ త్వరలోనే దేవర సినిమా(Devara Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
ఇక ఈ సినిమా అన్ని భాషలలో విడుదల కానున్న నేపథ్యంలో ఎన్టీఆర్ (NTR) ఇతర రాష్ట్రాలలో కూడా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో ఈయన మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఎన్టీఆర్ నటన పరంగా డాన్స్ పరంగా డైలాగ్స్ చెప్పడం విషయంలో కూడా ఎంతో టాలెంట్ కలిగిన వ్యక్తి అని ఇదివరకే ఎంతోమంది ఈయన గురించి తెలిపారు.

మనం డాన్స్ రిహార్సల్స్ చేస్తే గంటల తరబడి ప్రాక్టీస్ చేయాలి కానీ ఎన్టీఆర్ మాత్రం ఒక్కసారి చూసి స్టెప్పులు వేసేస్తారు అంటూ పలువురు సెలబ్రిటీలు ఎన్టీఆర్ నటన గురించి ఆయన డాన్స్(Dance ) గురించి కామెంట్లు చేశారు.కానీ ఎన్టీఆర్ మాత్రం తనకు డాన్స్ అంటే బోరింగ్ అని కేవలం నటన అంటేనే ఇష్టమని సంచలన విషయాలు వెల్లడించారు.ఇకపోతే తాను కూడా ఒక హీరో డాన్స్ కి వీరాభిమాని అంటూ ఈయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు విజయ్ దళపతి (Vijay Dalapathy) డాన్స్ కు తాను వీరాభిమానినని ఎన్టీఆర్ వెల్లడించారు.డాన్స్ అనేది డాన్స్ లా ఉండాలి.అదేదో ఫైట్ లా, జిమ్నాస్టిక్స్ లా ఉండకూడదు.
విజయ్ సర్ చాలా కూల్ గా ఉంటూనే అందంగా డాన్స్ చేస్తారు.ఆయన పెద్దగా కష్టపడుతున్నట్లు ఉండదంటూ విజయ్ గురించి ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.