సాధారణంగా ఒక్కోసారి ముఖ చర్మం కాంతి హీనంగా డల్ గా మారిపోతూ ఉంటుంది.అటువంటి చర్మాన్ని రిపేర్ చేయడం ఎలాగో తెలియక తెగ హైరానా పడి పోతూ ఉంటారు.
కానీ టెన్షన్ అక్కర్లేదు.ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో కేవలం 20 నిమిషాల్లో గ్లోయింగ్ అండ్ షైనీ స్కిన్ ను పొందవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా బాగా పండిన ఒక అరటి పండు( Banana ) తీసుకుని తొక్క తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.ఈ అరటిపండు స్లైసెస్ ని మిక్సీ జార్ లో వేసి స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు అరటిపండు ప్యూరీలో వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్( Green tea powder ), రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి( Multani soil ) మరియు రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ ( Rose water )వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక ప్రయత్నిస్తే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.ముఖ్యంగా ఈ రెమెడీ చర్మాన్ని సూపర్ గ్లోయింగ్ గా మారుస్తుంది.డల్ నెస్ ను పోగొడుతుంది.చర్మాన్ని మృదువుగా అందంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
స్కిన్ కలర్ ను ఈవెన్ గా మారుస్తుంది.చర్మంపై మచ్చలు ఏమైనా ఉంటే వాటిని పోగొడుతుంది.అంతేకాదు ఈ రెమెడీని ప్రయత్నించడం వల్ల మొటిమల సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.
కాబట్టి చర్మాన్ని కాంతివంతంగా అందంగా మెరిపించుకోవాలని భావించేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.