ఖరీదైన హోటల్స్‌లో బస చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోతుంది.ఎందుకంటే అక్కడి రూమ్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.
ఇలాంటి హోటల్స్ డెవలప్డ్ కంట్రీస్ లో మాత్రమే ఉంటాయని చాలా మంది అనుకుంటారు.కానీ ఇవి కెన్యా లాంటి పేద దేశాల్లో సైతం ఉంటాయి.
కెన్యాలో JW మారియట్ మసాయి మారా హోటల్( JW Marriott Masai Mara ) ఉంది.ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ హోటల్.
ఒక ఇండియన్ కపుల్ ఈ హోటల్‌లో బస చేశారు.అనిర్బాన్ చౌదరి, ఆయన భార్య ఆ హోటల్‌లో ఒక రాత్రికి రూ.3.5 లక్షలు (దాదాపు 4,200 డాలర్లు) ఖర్చు చేశారు.ఆ విషయాన్ని వాళ్లే స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు.ఈ విషయం కాస్త ఇప్పుడు చర్చనీయాంశమైంది.వారు చేసిన ఈ పని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.వారి పోస్ట్‌ను ఇప్పటికే దాదాపు 10 లక్షల మంది చూశారు.
ఆ హోటల్ మసాయి మారా అనే ప్రముఖ నేషనల్ పార్క్ లోపల ఉంది.అక్కడ సహజ సౌందర్యంతో పాటు చాలా సౌకర్యాలు కూడా ఉన్నాయి.
ఆ రిసార్ట్‌లో 22 చాలా పెద్ద టెంట్ రూమ్స్ ఉన్నాయి.ప్రతి రూమ్ లో హాట్ టబ్, లోపల, బయట వర్షపు నీళ్లతో స్నానం చేయడానికి అవకాశం, నక్షత్రాలను చూడడానికి ప్రత్యేకమైన స్థలంలాంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
అక్కడికి వెళ్ళే అతిథులను ఫిగ్ ట్రీ లౌంజ్‌లో మసాయి సంస్కృతికి సంబంధించిన నృత్యంతో స్వాగతం పలుకుతారు.అలాగే, రోజ్‌మేరీ, హిబిస్కస్‌తో చేసిన ప్రత్యేకమైన పానీయం ఇస్తారు.
అనిర్బాన్ చౌదరి( Anirban Chaudhary ) చెప్పినట్లు, ఆ హోటల్‌లో ఒక రాత్రికి ఇద్దరికి 106,000 మారియట్ బోనోయ్ పాయింట్లు ఖర్చు అయ్యాయి.ఆయన ఆ పాయింట్లు ఖర్చు చేయడం చాలా విలువైనదని భావిస్తున్నారు.ఆ ప్యాకేజీలో ఉండే గది, ఆహారం, కొన్ని రకాల పానీయాలు, అడవిలో భోజనం, సూర్యాస్తమయం వేళ తాగే పానీయాలు, ప్రతి రోజు జంతువులను చూడడానికి వెళ్ళే ప్రయాణం అన్నీ ఇంక్లూడై ఉన్నాయి.
JW మారియట్ మసాయి మారా అనేది కేవలం ఒక హోటల్ మాత్రమే కాదు, అక్కడ అడవిలోని జంతువులను చూడడానికి వెళ్ళే ప్రత్యేకమైన ప్రదేశం.అనిర్బాన్ ప్రకారం అక్కడికి వెళ్లే వారు అడవిలోని జంతువులను చూడడానికి వెళ్లి ఆనందించవచ్చు.ఆ రిసార్ట్ కీకోరోక్ ఎయిర్‌స్ట్రిప్ నుంచి 30-,40 నిమిషాల దూరంలో ఉంది.
చుట్టూ చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి.వీరి పోస్ట్ చూసే చాలామంది వావ్ అంటున్నారు.
హోటల్ గురించి మంచి రివ్యూ ఇచ్చావు బ్రదర్ అని ఒక యూజర్ అనగా, మరి కొంతమంది అక్కడ స్టే చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నానని ఇంకొకరు అన్నారు.పిల్లల పెద్దయ్యాక ఇలాంటి మంచి ఎక్స్పీరియన్స్ పొందుతానని ఒక యూజర్ కామెంట్ చేశారు.