అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లోని( New York ) స్వామి నారాయణ్ ఆలయంపై( Swaminarayan Temple ) గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించడం కలకలం రేపింది.దీనిపై అమెరికా చట్టసభ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూయార్క్ లాంగ్ ఐలాండ్ సమీపంలోని మెల్‌విల్లేలో ఉన్న బీఏపీఎస్ స్వామి నారాయణ్ ఆలయం వెలుపల, రహదారి, సైన్ బోర్డులపై అగంతకులు అసభ్యకరమైన వ్యాఖ్యలను స్ప్రే చేశారు.ఇక్కడికి కొద్దిదూరంలోనే ఉన్న నసావు వెటరన్స్ మెమోరియల్ కొలీజయంలో సెప్టెంబర్ 22న జరగనున్న మెగా ఈవెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) పాల్గొననున్నారు.
ఆ లోపే ఈ ఘటన జరగడం దుమారం రేపింది.
స్వామి నారాయణ్ మందిరాన్ని అపవిత్రం చేయడం నీచమైనదన్నారు యూఎస్ సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షుమెర్.( Chuck Schumer ) అమెరికాలో ద్వేషానికి చోటు లేదని షుమెర్ అన్నారు.ఈ విధ్వంసక చర్య హిందువులపై విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నమని.
అసహనం, విభజనపై ప్రేమదే విజయమని కాంగ్రెస్ సభ్యుడు రిచ్ మెక్ కార్మిక్( Rich McCormick ) అన్నారు.కలిసి నిలబడితే మనం ద్వేషం కంటే బలంగా ఉండగలమని చట్టసభ సభ్యుడు ఆండీ కిమ్ చెప్పారు.
తాను హిందూ అమెరికన్లకు( Hindu Americans ) అండగా ఉంటానని, బాధ్యులైన వారిని చట్టపరంగా పూర్తి స్థాయిలో విచారించాలని కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మాన్ స్పష్టం చేశారు.
మరోవైపు.ఈ ఘటనను న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయం ఖండించింది.ఇది హేయమైన చర్య అని.ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని , దీనికి కారణమైన వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు యూఎస్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో టచ్‌లో ఉన్నట్లు ఇండియన్ కాన్సులేట్ పేర్కొంది.నసావు కౌంటీలో భారతీయ కమ్యూనిటీ భారీ ఈవెంట్‌కు ప్లాన్ చేసిన సమయంలో హిందూ సంస్థలకు ఇలాంటి బెదిరింపులు రావడంపై హిందూ అమెరికన్ ఫౌండేషన్( Hindu American Foundation ) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
అమెరికా న్యాయ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ పరిశోధించాలని డిమాండ్ చేసింది.