హై-టెన్షన్ ఎలక్ట్రిక్ వైర్ తగలడంతో యువకుడు స్పాట్‌డెడ్.. వీడియో వైరల్..

ఈ రోజుల్లో ప్రమాదాలు ఎటు నుంచి పొంచి వస్తాయో ఊహించలేని పరిస్థితి.రోడ్డుపైకి వెళ్తే ఏదో ఒక వాహనాన్ని ఢీకొనే అవకాశం ఉంటుంది.

 Ghaziabad, High-tension Wire, Electrocution, Viral News, Viral Video, Live Death-TeluguStop.com

ఆటాడుకోవడానికి వెళ్తే వీధి కుక్కల రూపంలో మృత్యువు వెంటాడుతుంది.ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇతరుల నిర్లక్ష్యం కారణంగా చావు అనేది వస్తోంది.

తాజాగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘాజియాబాద్‌ సిటీలో ( Ghaziabad city of Uttar Pradesh state )ఇలాంటి ఓ దుర్ఘటన చోటు చేసుకుంది.ముస్సూరీ గంగా కాలువ( Mussoorie Ganges Canal ) దగ్గర చాలా తక్కువ ఎత్తులో వేలాడుతున్న హైటెన్షన్ విద్యుత్ తీగను తాకి ఒక యువకుడు అక్కడికక్కడే మరణించాడు.

ఈ విషాద సంఘటన గురువారం జరిగింది.మృతుడిని 22 ఏళ్ల కైఫ్‌గా( Kaif ) గుర్తించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కైఫ్ కాలువ దగ్గర కదలకుండా పడి ఉండగా, అతని శరీరం నుంచి పొగ వస్తున్న దృశ్యం కనిపిస్తోంది.గత కొన్ని రోజులుగా ఈ కరెంటు వైర్ చాలా తక్కువ ఎత్తులో వేలాడుతుందని స్థానికులు తెలిపారు.

దీనివల్ల ఇప్పటికే రెండు ఎద్దులు ప్రాణాలు కోల్పోయాయి.అంతేకాకుండా, కొన్ని రోజుల క్రితం ఒక వృద్ధుడు కూడా ఈ తీగను తాకి విద్యుత్ షాక్‌కు గురయ్యాడని స్థానికులు పేర్కొన్నారు.

ఈ ప్రమాదం గురించి అధికారులకు సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు.ఈ విషయంలో బాధ్యులైన అధికారులు, విద్యుత్ సంస్థ ఉద్యోగులపై కేసు నమోదు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఎదిగొచ్చిన కుమారుడు ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.ఇలాంటి సంఘటనలు ఏపీలో కూడా చోటుచేసుకున్నాయి.కొన్ని రోజుల క్రితం ఇద్దరు విద్యార్థులు సైకిల్ పై వెళ్తూ కిందకి వేలాడుతున్న కరెంటు వైర్ పట్టుకుని అక్కడికక్కడే మరణించారు.ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube