ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్( Johnny master ) ఒకరు కాగా జానీ మాస్టర్ ను పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో( Upparapally Court ) హాజరు పరిచిన సంగతి తెలిసిందే.జానీ మాస్టర్ తాను ఎవరిపై లైంగిక దాడికి పాల్పడలేదని తాను ఎవరినీ గాయపరచలేదని చెప్పుకొచ్చారు.
మరోవైపు కోర్టు మాత్రం జానీ మాస్టర్ కు రిమాండ్ విధించింది.కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించడం గమనార్హం.
పోలీసులు జానీ మాస్టర్ ను చంచల్ గూడ జైలుకు ( Chanchal Guda Jail )తరలించారని సమాచారం అందుతోంది.నార్సింగి పోలీసులు( Narsinghi Police ) గోవాలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు.ముంబై హోటల్ లో జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.జానీ మాస్టర్ వివాదంలో బాధితురాలు మాత్రం మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది.
పోలీసులు జానీ మాస్టర్ ను రహస్య ప్రదేశంలో విచారించి పలు కీలక అంశాలపై ఆరా తీశారని సమాచారం అందుతోంది.
హైదర్ గూడలోని ఒక ఆస్పత్రిలో వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ఆయనను హాజరు పరిచారని తెలుస్తోంది.పోక్సో కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ ఈ కేసు నుంచి బయటపడతారో లేదో చూడాలి.జానీ మాస్టర్ మాత్రం తానేం తప్పు చేయలేదని చెబుతున్నారు.
జానీ మాస్టర్ పై ఆరోపణలు ప్రూవ్ అయితే మాత్రం కఠిన శిక్షలు పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేయాల్సిన పలు సినిమాలకు సైతం ఇబ్బందులు ఎదురయ్యాయని తెలుస్తోంది.
జానీ మాస్టర్ ఒక్కో సాంగ్ కు 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.జానీ మాస్టర్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.