ఈ మధ్యకాలంలో సినిమాల నిడివి అన్నది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది.ముఖ్యంగా మూవీ మేకర్స్ ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి.
సినిమా నిడివి ఎక్కువ ఉన్నప్పుడు సినిమాలో ఏ సన్నివేశాన్ని తీసివేయాలి అన్న విషయం వారికి పెద్ద సమస్యగా మారిపోయింది.నిడివి ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు సినిమాను బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు.
దీంతో ఇది పెద్ద టాస్క్ గా మారిపోయిందనే చెప్పాలి.ముఖ్యంగా చాలా మంది దర్శకులు అనవసరంగా నిడివి పెంచుతున్నారు.
లెంగ్త్ ను హ్యాండిల్ చేయడం అన్నది చేత కావడం లేదు.
సందీప్ వంగా లాంటి కొద్ది మంది మాత్రమే ఎంత లెంగ్త్ సినిమా తీసినా జనాలను కుర్చీలకు అతుక్కుని కూర్చో పెట్టగలుగుతున్నారు.సినిమా ఏ మాత్రం తేడా చేసినా ముందు కామెంట్ లెంగ్త్ మీదనే పడుతోంది.సినిమా విడుదలకు ముందు దర్శకులు ఎవరెంత చెప్పినా లెంగ్త్ తగ్గించడం లేదు.
విడుదల తరువాత అడ్డగా కొసేస్తున్నారు.ఇకపై వచ్చే వారం విడుదల అవుతున్న ఎన్టీఆర్, కొరటాల శివ ( NTR, Koratala Shiva )సినిమా దేవర విషయంలో కూడా అలాంటి సమస్య రాకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు మూవీ మేకర్స్.
ఒకటికి పదిసార్లు చూసుకుని ఫైనల్ కట్ డిసైడ్ చేసారు.అన్ని వర్క్ లు దాదాపు పూర్తయిన తరువాత కూడా చూసుకుని అయిదు నిమిషాలు కట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.
అయితే ఇప్పుడు సినిమా నిడివి టైటిల్స్ టు టైటిల్స్ కలిపి రెండు గంటల 42 నిమిషాలకు పరిమితం చేసారట.ఒక పెద్ద సినిమాకు ఇది పెర్ ఫెక్ట్ నిడివి అనే చెప్పాలి.మామూలుగా చాలా వరకు సినిమాలు రెండు గంటల 30 నిమిషాలు మాత్రమే ఉంటాయి.అయితే రెండు గంటల 47 నిమిషాలు ఉండే దేవర సినిమాని ఐదు నిమిషాలు తగ్గించి 2:42 నిమిషాలకు పరిమితం చేశారట.రిలీజ్ కి ముందే మూవీ మేకర్స్ ఈ సినిమా పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.మరి ఈ సినిమా విషయంలో కొరటాల శివ అనుకున్నదే నిజమవుతుందేమో చూడాలి మరి.