బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీ కపుల్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు రణవీర్ సింగ్(Ranaveer Singh) , నటి దీపిక పదుకొనే (Deepika Padukone) జంట ఒకటి.వీరిద్దరూ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్నారు.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న దీపిక తన కెరీర్ కు కాస్త బ్రేక్ ఇచ్చి ఇటీవల తన జీవితంలోకి మరో కొత్త వ్యక్తిని ఆహ్వానించారు.తాను తల్లి కాబోతున్నాననే విషయాన్ని అభిమానులతో పంచుకున్న ఈమె సెప్టెంబర్ 8వ తేదీ పండంటి ఆడబిడ్డకు (Baby Girl) జన్మనిచ్చారు.
ఇక తల్లి బిడ్డ ఇద్దరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా తిరిగి ఇంటికి కూడా చేరుకున్నారు.అయితే బిడ్డ పుట్టగానే తన కూతురికి దీపిక ఎంతో ఖరీదైన కానుకను అందించారని తెలుస్తుంది.మరి దీపిక తన కుమార్తె కోసం కొన్న ఆ విలువైన కానుక ఏంటి అనే విషయానికి వస్తే.ఈమె తన కూతురి కోసం ఏకంగా ఓ లగ్జరీ ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తుంది.దీపికా పదుకొణె కంపెనీ కేఏ ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్పి ముంబైలోని పాష్ ఏరియా బాంద్రాలో ₹17.8 కోట్లతో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తుంది.
ఇక దీపిక పదుకొనే సినిమాలలో సంపాదించింది మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు.ఇప్పటికే ఈమెకు ముంబైలోని పలు ప్రాంతాలలో ఖరీదైన అపార్ట్మెంట్లు ఉన్నాయి.తాజాగా మరో అపార్ట్మెంట్ ను కొనుగోలు చేశారు.సుమారు 1,846 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త అపార్ట్‌మెంట్ ఎంతో విశాలవంతంగా అన్ని సౌకర్యాలతో ఉందని తెలుస్తుంది.
అయితే ఈ ఇంట్లో తన కూతురితో కలిసి ఎంతో సంతోషంగా గడపడం కోసమే దీపికా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.