రాంగ్ రూట్‌లో వచ్చి బైకర్‌ను ఢీకొట్టిన కారు.. వీడియో చూస్తే గుండెలదురుతాయి..

తాజాగా గురుగ్రామ్‌లో( Gurugram ) ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ కారు ఒక 23 ఏళ్ల బైక్ రైడర్‌ను చాలా వేగంగా ఢీ కొట్టింది.

 Viral Video, Viral News, Biker, Car, Gurugram, Accident, Sudden Death,-TeluguStop.com

ఎదురుగా వస్తున్న ఆ కారు మెరుపు వేగంతో ఢీకొట్టడంతో సదరు రైడర్ అక్కడికక్కడే మరణించాడు.ఈ దుర్ఘటనని వెనకాలే వస్తున్నా ఒక ప్రయాణికుడు వీడియో రికార్డు చేశాడు.

ఆ వీడియోలో, ఆ యువకుడు తన బైక్‌ను చాలా వేగంగా నడుపుతున్నట్లు కనిపించింది.అతను వెళ్తున్న రూట్ లోనే ఒక కారు సడన్గా ప్రత్యక్షమైంది.

అంతే అప్పట్లో ఆ బైకర్ కారును బలంగా ఢీ కొట్టి కిందపడిపోయాడు.ఆ రూట్ లో కారు అసలు ప్రయాణించకూడదు.

బైకర్‌ సరైన డైరెక్షన్ లోనే వెళ్తున్నాడు కానీ కారు డ్రైవర్ అక్కడ నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యాడు.బైకర్ కొంచెం మెల్లిగా మోటార్ సైకిల్ నడిపినట్లు అయితే ఈ ప్రమాదం తీవ్రత తక్కువగా ఉండేది.

కొంత దూరంలో వెనుక వస్తున్న కొంతమంది ఈ దృశ్యాన్ని చూసి వెంటనే ఆ ప్రమాద స్థలానికి చేరుకున్నారు.యువకుడిని పరిశీలించిన తర్వాత, ఎదురుగా వచ్చిన కారు డ్రైవర్‌ను ప్రశ్నించారు.

ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అక్కడే అడ్డుకున్నారు.గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై( golf course road ) ఈ యాక్సిడెంట్ జరిగింది.

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి పేరు అక్షత్ గర్గ్.( Akshat Garg ) ఈ యువకుడు వయసు 23 ఏళ్లు.

ఇది ఆదివారం ఉదయం 5:45 గంటలకు డీఎల్‌ఎఫ్ ఫేస్ II ప్రాంతంలో జరిగింది.అతని వెనుక వస్తున్న స్నేహితుడు గోప్రో కెమెరాతో ఈ ప్రమాదాన్ని రికార్డ్ చేశాడు.

అక్షత్ గర్గ్ అన్ని రకాల భద్రతా పరికరాలు ధరించినప్పటికీ, కారు తాకిడికి అక్కడికక్కడే మరణించాడు.ఈ ప్రమాదం జరిగిన తర్వాత కొంతమంది బైక్‌పై వచ్చిన వారు అక్షత్‌ను చూసి వెంటనే అక్కడికి చేరుకుని, కారు డ్రైవర్‌ను ప్రశ్నించారు.ఈ సంఘటన గురించి ఐఏఎన్‌ఎస్ వార్తా సంస్థ( IANS news agency ) వార్త ప్రచురించింది.ప్రస్తుతం పోలీసులు ఈ ప్రమాదం ఎలా జరిగిందో విచారణ చేస్తున్నారు.

గురుగ్రామ్‌లో ఇలాంటి ప్రమాదాలు చాలా సాధారణంగా జరుగుతున్నాయి.ప్రజలు ఫ్లైఓవర్‌లపై కూడా తప్పు దిశలో వాహనాలు నడుపుతున్నారు.ఇది చాలా దారుణం.” అని వీడియో చూసిన ఒక వ్యక్తి కామెంట్ చేశాడు.“తప్పు దిశలో వాహనం నడపడం ఇప్పుడు చాలా సాధారణంగా మారిపోయింది.పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.

కానీ వారు అన్ని చోట్ల ఎప్పుడూ ఉండలేరు.మనం కూడా ఇతరుల గురించి కొంచెం ఆలోచించాలి.ఒకరోజు మనమే ఇలాంటి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.” అని ఇంకొక యూజర్ అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube