1.రష్యా దౌత్యవేత్తలను దేశం విడిచి వెళ్లాలన్న అమెరికా

రష్యా దౌత్య వేత్తలను తమ దేశం విడిచి వెళ్లాలంటూ అమెరికా ఆదేశాలు జారీ చేసింది.
2.వ్యూహన్ లో కరోనా కలకలం
చైనాలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.ఈ వైరస్ మొదట వ్యాపించిన వ్యూహాన్ లో మళ్లీ కేసుల సంఖ్య విజృంభిస్తుండడం ఆందోళన పెంచుతోంది.
3.అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది.రిక్టార్ స్కేల్ పై 6.1 గా దీని తీవ్రత నమోదయ్యింది.
4.బిల్ గేట్స్ విడాకులకు కోర్టు ఆమోదం

బిల్ గేట్స్ , మెలిండ గేట్స్ 27 ఏళ్ల వైవాహిక బంధానికి అధికారికంగా బ్రేక్ పడింది.మెలిండా చేసుకున్న దరఖాస్తుకు కోర్టు ఆమోదం తెలిపింది.
5.మయన్మార్ ప్రధాని నేనే అంటూ ప్రకటన

ఇక మయన్మార్ ప్రధాని నేనే అంటూ ఆర్మీ చీప్ మిన్ ఆంగ్ హ్లెయింగ్ తనకు తానే ప్రకటించుకున్నారు.
6.వ్యూహాన్ లో అందరికీ కరోనా టెస్ట్ లు
కరోనా వైరస్ పుట్టుకకు కారణం అయిన వ్యూహాన్ నగరంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఆ పట్టణ ప్రజలకు మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
7.అమెరికన్ల కు నచ్చని కమలా హారీస్ పనితీరు

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ పనితీరు పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.6 నెలల కాలంలోనే ఆమె పనితీరుపై 48 శాతం ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
8.2030 నాటికి భారతే టాప్
2030 నాటికి భారత్ అన్ని విభాగాల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ అవుతుంది అని అమెరికన్ అంబాసిడర్ ( భారత్ ) మాజీ రాయబారి రిచర్డ్ వర్మ అన్నారు.
9.దుబాయ్ లో భారత్ కాన్సులెట్ తొలి వార్షికోత్సవం

దుబాయ్ లోని భారత కాన్సులేట్ గత ఏడాది ఆగస్ట్ 1 తో ఈ సేవలకు ఏడాది పూర్తయిన సందర్భంగా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తొలి వార్షికోత్సవం నిర్వహించింది.
10.టీచింగ్ స్టాఫ్ కు ఒమెన్ శుభవార్త
సుల్తానేట్ కు తిరుగొచ్చే టీచింగ్ స్టాఫ్,వారి కుటుంబ సభ్యులకు ఒమెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.వీరికి ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.