బుల్లితెరపై ప్రసారమైన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి ప్రత్యూష బెనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సీరియల్ నటిగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఆత్మహత్య చేసుకోవడంతో దేశవ్యాప్తంగా ఈ వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తన బాయ్ ఫ్రెండ్ రాజ్ సింగ్ కారణమని ఆరోపణలు తలెత్తాయి.
ప్రత్యూష బెనర్జీ మరణం తర్వాత తన తల్లిదండ్రులు తనకు న్యాయం జరగాలని పోరాడుతూ తమ సర్వస్వం కోల్పోయామని, తన కూతురి మరణం తరువాత చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని ప్రత్యూష తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఒక సింగిల్ రూమ్ లో జీవనం కొనసాగిస్తున్నామని, పూట గడవడం కోసం తను చైల్డ్ కేర్ సెంటర్ లో పని చేస్తున్నానని తన భర్త కథలు రాస్తూ పూట గడుపుతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

2016వ సంవత్సరంలో ప్రత్యూష బెనర్జీ ఓ అపార్ట్మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఈ క్రమంలోనే తన మరణం వెనుక తన బాయ్ ఫ్రెండ్ రాజ్ సింగ్ కారణం అంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.ఆ తర్వాత మూడు నెలల అనంతరం బెయిల్ పై బయటకు వచ్చిన రాజ్ సింగ్ నటి సలోని శర్మను వివాహం చేసుకుని సంతోషంగా గడుపుతున్నారని తమ కూతురు మరణం తరువాత మా సర్వస్వాన్ని కోల్పోయామని ఈ సందర్భంగా ప్రత్యూష తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.