ఇన్‌స్టాగ్రాం సరికొత్త ఫీచర్‌తో డబ్బులు సంపాదించవచ్చు!

ఇన్‌స్టాగ్రాంలో సరికొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుందట.దీంతో యూజర్లు డబ్బులు సంపాదించుకునే వెసులుబాటు ఉంటుందట.

 Instagram Introduced Another New Feature For Cash Earning, Instagram, Instagram-TeluguStop.com

ఇప్పటివరకు షాపింగ్‌ చేసుకునే ఆప్షన్‌ను అందించిన ఇన్‌స్టాగ్రాం తాజాగా తన నయా ఫీచర్‌తో డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని యూజర్లకు అందిస్తోంది.ఇటీవల మైక్రోబ్లాగింగ్‌ యాప్‌ ట్వీటర్‌ యూజర్లకు ఇన్‌కం అందించడానికి సూపర్‌ ఫాలో అనే కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చిన సంగతి తెలిసందే! ఈ నేపథ్యంలో దీనికి పోటీగా ఇన్‌స్టాగ్రాం కూడా ప్రత్యేక ఫీచర్‌ను రూపొందింస్తోందని సమాచారం.

దీని పేరు ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీస్‌.ఈ నయా యాప్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా ఇప్పటికే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

ఇప్పటికే ఉన్న స్టోరీస్‌ ఫీచర్‌కు అదనపు హంగులను అందించడానికి ఈ కొత్త ఫీచర్‌ను తయారు చేస్తోంది.ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.మామూలు స్టేటస్‌లకు, దీనికి చాలా తేడా ఉంటుంది.

రంగుల విషయంలో ఆ తేడాను బాగా గమనించొచ్చు అని తెలుస్తోంది.ఈ స్టోరీల కోసం ప్రొఫైల్‌లో ఓ ప్రత్యేక ట్యాబ్‌ ఉంటుంది.

అంటే పోస్టులు, రీల్స్, అన్నమాట.

ఈ ప్రత్యేక ఫీచర్‌ తయారీలో ఇన్‌స్టాగ్రాం చాలా కేర్‌ తీసుకుని రూపొందిస్తోంది.

ముఖ్యంగా ఇందులో స్క్రీన్‌ షాట్‌ తీసుకునే అవకాశం ఉండదు.కానీ, వాటిని హైలైట్స్‌గా మాత్రమే షేర్‌ చేయవచ్చు.

అలాగే ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీలు చూసేటప్పుడు… వాటిని మీ హైలైట్స్‌లో పోస్ట్‌ చేసి ఎక్కువమందికి చేరేలా చేయండి అని కూడా సూచిస్తోంది ఇన్‌ స్ట్రాగామ్‌.

Telugu Earn, Exclusive, Fallowers-Technology Telugu

ఇదంతా చూస్తుంటే… ఈ సరికొత్త స్టోరీస్‌ ఫీచర్‌తో ట్వీటర్‌ సూపర్‌ ఫాలోకు గట్టి పోటీని ఇవ్వచ్చు.ఇన్‌ స్ట్రాగామ్‌ అంటే ఒకప్పుడు కేవలం ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసుకునే ప్లాట్‌ఫాంగా మాత్రమే ఉండేది.అయితే సోషల్‌ మీడియా సర్వీసులకు పోటీగా చాలా మార్పులు చేసుకుంటూ వస్తోంది.

వాటి గురించి సంస్థ చీఫ్‌ ఆడమ్‌ మొసెరీ వివరించారు.ఇకపై ఇన్‌స్ట్రాగామ్‌ కేవలం ఫొటో షేరింగ్‌ యాప్‌ మాత్రమే కాదు.

ఇన్‌ స్టాలో ఇటీవల చేసిన మార్పులు, చేర్పులు చూస్తే… ఈ మాట ఎవరైనా చెప్పేస్తారు.

Telugu Earn, Exclusive, Fallowers-Technology Telugu

స్టోరీస్, రీల్స్, ఫిల్టర్స్‌ … ఇలా చాలానే వచ్చాయి.యూట్యూబ్, టిక్‌టాక్‌ లాంటి పోటీదారుల కంటే ఇన్‌ స్ట్రాగామ్‌ ఇంకా బెటర్‌ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది.దీని కోసం క్రియేటర్స్, వీడియోస్, షాపింగ్, మెసేజింగ్‌ విభాగాలను మరింత పటిష్ఠం చేయనుంది.

భవిష్యత్తు సోషల్‌ మీడియా ఈ నాలుగు విభాగాల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందని భావించడమే ఇందుకు కారణం.దీంతోపాటు యాప్‌లో ఈకామర్స్‌ ఇంటిగ్రేషన్‌ ను మరింతగా పెంచబోతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube