టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలను అభిమానులు ఎంతగానో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే.టాలీవుడ్ హీరోలకు ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో కోలీవుడ్ హీరో విజయ్ కు కూడా తమిళనాడులో ఫ్యాన్ ఫాలోయింగ్ అదే స్థాయిలో ఉంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాతో విజయ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.ప్రస్తుతం ఈ హీరో బీస్ట్ అనే మూవీలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
నేడు విజయ్ పుట్టినరోజు కాగా విజయ్ నేటితో 47వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు.విజయ్ పుట్టినరోజుకు అన్ని భాషల సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుండటం గమనార్హం.నాలయై తీర్పు అనే సినిమాతో హీరోగా ఆరంగేట్రం చేసిన విజయ్ వరుసగా సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించినా నాలమై తీర్పు సినిమాతోనే విజయ్ కు నటుడిగా మంచి పేరు వచ్చింది.
ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ విజయ్ స్టార్ హీరోగా ఎదగడం గమనార్హం.1999 సంవత్సరంలో విజయ్ వివాహం చేసుకోగా విజయ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కావడం గమనార్హం.విజయ్ పెళ్లి చేసుకున్న సంగీత విజయ్ అభిమాని కాగా సంగీత మొదట విజయ్ కు లవ్ ప్రపోజ్ చేస్తే ఆ తరువాత విజయ్ యాక్సెప్ట్ చేశారు.ఆ తరువాత విజయ్ సంగీత మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

చెన్నైకు చెందిన సంగీత యూకేలో నివశిస్తూ ఉండేవారు.ఒక సినిమా షూటింగ్ నిమిత్తం విజయ్ యూకేకు వెళ్లగా అక్కడ సంగీతతో విజయ్ కు పరిచయం ఏర్పడింది.ఆ తరువాత విజయ్ సంగీత ఫోన్ నంబర్లు మార్చుకున్నారు.పెద్దలను ఒప్పించి విజయ్ సంగీత వివాహం చేసుకున్నారు.ప్రస్తుతం కోలీవుడ్ లో విజయ్ నంబర్ 1 హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.