అనిరుథ్ యంగ్ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ చిన్న వయసులోనే తన అద్భుత మ్యూజిక్ స్కిల్స్ తో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని అబ్బుర పరిచయాడు.వై దిస్ కొలవరి అంటూ దేశ వ్యాప్తంగా దుమ్మురేపాడు.
తెలుగులో పలు సినిమాలకు సంగీతం అందించాడు.మ్యూజిక్ మాట కాస్త అటుంచితే.
అనిరుత్ మాంచి శ్రుంగార పురుషుడు.అతడితో చాలా మంది అమ్మాయిలు ప్రేమలో పడ్డారు.పబ్బులు, పార్టీలు అంటూ తెగ సందడి చేశారు.వీటిలో కొన్న ఎఫైర్లు అప్పట్లో మస్త్ కాంట్రవర్షియల్ అయ్యాయి.ఇంతకీ వివాదాలకు కారణం అయిన ఆ ప్రేమాయణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అనిరుథ్ – ఆండ్రియా

వయసులో అనిరుథ్ కంటే చాలా పెద్దది అందాల భామ ఆండ్రియా.ఏమాయ చేశాడో కానీ.ఈ కుర్రహీరో మోజులో పడింది ఈ ముద్దుగుమ్మ.
ఈ నటి మాత్రమే కాదు .సింగర్, మ్యూజిక్ లవర్.అందుకే వీరి పరిచం ఏర్పడింది.అదికాస్తా ప్రేమగా మారింది.కొన్నాళ్లు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు.ఆ తర్వాత కొన్ని కారణాలతో ఇద్దరూ విడిపోయారు.
అనిరుథ్ – శృతిహాసన్
కమల్ హాసన్ ముద్దుల బిడ్డ, ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ కూడా అనురుథ్ తో ప్రేమాయణం నడిపిందనే రూమర్లు వచ్చాయి.ఈమె కూడా పాటలు పాడుతుంది.
అంతేకాదు అనిరుథ్ సంగీతం అందించిన 3 సినిమాలో ఈమె హీరోయిన్ గా చేసింది.అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందట.
అయితే తామిద్దరం మ్యూజిక్ లవర్స్ కావడం మూలంగా సంగీతం గురించి మాట్లాడుకున్నామే తప్ప ప్రేమ వ్యవహారం లేదని చెప్పాడు ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్.

నిజానికి అనిరుథ్ ను తమిళ సినిమా పరిశ్రమలో ఫ్లేబాయ్ అంటారు.కుర్రాడు చూడ్డానికి సన్నగా, ఇన్నోసెంట్ గా కనిపించినా మామూలోడుకాదు అంటారు సినీ జనాలు.యంగ్ హీరోయిన్లతో పాటు తన కంటే వయసులో పెద్ద భామలను సైతం పడేస్తాడనే అభిప్రాయం ఉంది.
ఈయనకు ఎఫైర్లు అంటే తెగ ఇష్టం అంటారు.అయితే ఈ వార్తలన్నీ అవాస్తవాలు అంటాడు అనిరుథ్.
కావాలనే తనను కొందరు కార్నర్ చేసి మాట్లాడుతున్నారని కామెంట్ చేశాడు.ఎఫైర్ల విషయం అటుంచిత మ్యూజిక్ విషయంలో ఏమాత్రం రాజీపడడు ఈ యంగ్ మ్యాన్.