గత రెండేళ్ళ కాలంలో కరోనా లాంటి విపత్కర సమయంలో డాక్టర్లు తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ముందుండి ఎంతో మంది కరోనా రోగుల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.ఫ్రంట్ లైన్ వర్కర్లుగా తమ సేవలు సమాజానికి ఎంత అవసరమో అనే విషయాన్ని మరో సారి అందరికి అర్ధమయ్యేలా చేసారు.
డాక్టర్లని దైవంతో ఎందుకు పోల్చుతారో అనే విషయాన్ని మరో సారి వారు రుజువు చేస్తున్నారు.డాక్టర్లని వ్యాపార సంస్థలు బిజినెస్ కోసం ఉపయోగించుకొని ప్రజల నుంచి లక్షలు వసూలు చేస్తాయేమో కాని డాక్టర్లు మాత్రం వారి వృత్తికి వంద శాతం న్యాయం చేస్తారని దేశ వ్యాప్తంగా లక్షలాది మంది వైద్య సిబ్బంది ప్రూవ్ చేశారు.
కరోనాతో జరుగుతున్న పోరాటంలో ఎంతో మంది వైద్య సిబ్బంది ప్రాణాలు సైతం కోల్పోయారు.

అయిన కాని వారు యుద్ధం చేస్తూనే ఉన్నారు.అలాంటి వైద్యులకి, వైద్య సిబ్బందికి మన తరుపున ఏ విధంగా ట్రిబ్యూట్ ఇవ్వగలం అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది.నేచురల్ స్టార్ నాని కూడా ఇదే ఆలోచనతో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ఉన్న డాక్టర్లు కోసం దారేలేదా అనే వీడియోని తెరకెక్కించి వారికి అంకితం ఇచ్చారు.
ఈ వీడియోలో సత్యదేవ్ డాక్టర్ పాత్రలో కనిపించాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ దారేలేదా వీడియో చూసి ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించారు.ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన డాక్టర్లుని ఇంతకంటే గొప్ప ట్రిబ్యూట్ ఉండదని పేర్కొన్నారు.
ఇలాంటి వీడియో రూపొందించిన నాని టీమ్ కి అభినందనలు తెలిపారు.