ఎర్రబెల్లికి చుక్కలు చూపించిన విజయశాంతి.. !!

ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు గాడీ తప్పినాయంటున్నారు విశ్లేషకులు. రాజకీయం అంటే ప్రజాసేవ అన్నది మరచి, పదవులు, ఆస్తులు కాపాడుకోవడం అనే తీరుగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 Bjp Leader Vijayashanthi Fires On Errabelli Dayakarrao, Telangana, Bjp, Vijayas-TeluguStop.com

ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు మాత్రం ప్రత్యేకమైన దారిలో ప్రయాణిస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారట.

ఇక ఎవరి డప్పు వారు కొట్టుకుంటున్న వారిని ఏమంటారో జనమే నిర్ణయించాలి.

ఇదిలా ఉండగా మంత్రి ఎర్రబెల్లి వరంగల్ పర్యటన పై బీజేపీ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో బ్రతుకుతున్నారంటే దానికి కారణం తమ ప్రభుత్వమే అని ప్రచారం చేసుకుంటున్న టీఆర్ఎస్ నేతలను చూస్తుంటే ఏం అనాలో అర్ధం కావడం లేదని, ఎర్రబెల్లి వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యటించిన సమయంలో దాదాపు అర్ధగంట పాటు ఎటూ కదలనివ్వక ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు చుక్కలు చూపించారని విజయశాంతి అన్నారు.

ఇక రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని బానిస తెలంగాణగా మార్చుతున్న సీఎం కు వంత పాడే మంత్రులు ఉన్నంత కాలం ఈ డూడూ బసవన్నల ఆటలు జనం భరించవలసిందేనంటూ విమర్శించారు.రాష్ట్రంలో అధికార పార్టీ నేతల కుటుంబాలు తప్ప ఒక్క వర్గం కూడా సంతృప్తిగా బతుకుతున్న దాఖలా లేదని మండిపడ్డారు.

ఇలా మొత్తానికి విజయశాంతి ఎర్రబెల్లి పలుకులన్ని అబద్దాలని చెప్పకనే చెబుతున్నదని జనం అనుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube