ఏపీలో వైఎస్సార్ ప్రీ ప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్టు సిఎం జగన్ చెప్పారు.తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ విద్యార్ధులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్య అందించాలన్నది తన తపన అని చెప్పారు.
నిరుపేదలకు నాణ్యమైన విద్య అందించాలని.పిల్లలకు కిలోమీటర్ దూరంలోనే ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
నాడు నేడుతో స్కూళ్ల రూపు రేఖలు మార్చేస్తున్నాం.ఇక వైఎస్సార్ ప్రీ ప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లతో విద్యా ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు.
6 ఏళ్ల లోపు చిన్నారుల్లో మేధో వికాసం ఉంటుంది.ఆ టైం లోనే చిన్నారులకు మంచి విద్య అందించాలని.
అందుకే ప్రీ ప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లు పెడుతున్నామని అన్నారు వైఎస్ జగన్.ఏరియా వైజ్ గా అందరికి అందుబాటులో ఉండేలా కేవలం కిలోమీటర్ దూరంలోనే ఈ స్కూళ్లు ఉండేలా చూస్తామని అన్నారు.
ఇక హైస్కూళ్లు కూడా 3 కిలోమీటర్ల దూరంలో ఉండేలా చేస్తామని అన్నారు.స్కూళ్ల మ్యాపింగ్ కూడా అదే విధంగా మార్పించాలన్ అధికారులకు చెప్పారు జగన్.
నిరుపేద విద్యార్ధులకు వైఎస్సార్ ప్రీ ప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్ల ద్వారా మంచి విద్య నేర్చుకునే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అయితే దీన్ని అక్కడ నిరుపేద విద్యార్ధులు వినియోగించుకునేలా కార్యచరణ చేయాలని అధికారులకు సూచించారు వై.ఎస్ జగన్.