డబ్బులిచ్చి మరీ ఆ పని చేస్తానన్న కాజల్.. ఏం జరిగిందంటే..?

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత కూడా సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం చేతినిండా ఆఫర్లు ఉన్న ఈ బ్యూటీ కొత్త కథలను కూడా వింటున్నారని తెలుస్తోంది.

 Tollywood Actress Kajal Agarwal Interested In Hair Styling, 2 Crore Rupees, Hai-TeluguStop.com

ఒకవైపు అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తూనే గ్లామర్ రోల్స్ లో కూడా నటిస్తున్న కాజల్ అగర్వాల్ తనకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

తనకు రెడీ కావడంతో పాటు రెడీ చేయడం కూడా ఇష్టమేనని ఆమె వెల్లడించారు.

చిన్న వయస్సులో తాను చెల్లికి డబ్బులు ఇచ్చి మరీ హెయిల్ స్టైలింగ్ చేసేదాననినని తన గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ ను ఆమె వెల్లడించారు.మరోవైపు ఈ బ్యూటీ ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తుండగా ఆచార్య సినిమాలో కాజల్ పాత్రకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

కొన్నేళ్ల క్రితం కాజల్ చిరంజీవితో కలిసి ఖైదీ నంబర్ 150 సినిమాలో నటించారు.Telugu Crore Rupees, Kajal Agarwal, Kajal-Movie

బాక్సాఫీస్ దగ్గర ఖైదీ నంబర్ 150 లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుండటంతో ఆచార్య కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరోవైపు కాజల్ పెళ్లి తరువాత కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.ఒకవైపు మిడిల్ రేంజ్ హీరోలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మరోవైపు పెద్ద హీరోల సినిమాల్లో కూడా నటిస్తున్నారు.

నాగార్జున ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో సైతం కాజల్ అగర్వాల్ హీరోయిన్ కావడం గమనార్హం.ఈ సినిమాలో కాజల్ రా ఏజెంట్ రోల్ లో నటిస్తుండటం గమనార్హం.

కాజల్ పెళ్లి తరువాత కొత్త తరహా కథలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు.కాజల్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రెండు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube