తెలుగులో ఒకప్పుడు అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, బద్రి, సూపర్, టెంపర్, తదితర సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు “పూరి జగన్నాథ్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ మధ్య కాలంలో దర్శకుడు పూరి జగన్నాథ్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ మోటివేషనల్ స్పీచెస్ తో ప్రేక్షకులని బాగానే అలరిస్తున్నాడు.
అంతేగాక అప్పుడప్పుడు ఈ కరోనా విపత్కర సమయంలో ప్రజలు ఎలా ఉండాలనే విషయంపై కూడా మరిన్ని మంచి మాటలు చెబుతూ వీడియోలను కూడా విడుదల చేస్తున్నాడు.
అయితే తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్ మరోమారు ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా విపత్కర పరిస్థితులపై స్పందించాడు.
ఇందులో భాగంగా గతంలో ప్రపంచంలోని పలు దేశాలు విపత్కర సంఘటలను ఎదుర్కొని బయటపడ్డ విశయాల గురించి ప్రేక్షకులకి తెలియజేస్తూ ధైర్యం చెప్పాడు.ఇందులో భాగంగా మానవాళి ఎప్పుడూ ఏదో ఒక సందర్భంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి మరియు ఎదుర్కుంటూనే నిత్యం తమ జీవితాలతో యుద్ధం చేస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమయంలో కొంత సంయమనం పాటించి ఇంటి పట్టునే ఉండడంవల్ల ఈ గడ్డు పరిస్థితులను కూడా ఎదుర్కోగలమని ధైర్యం చెప్పాడు.
అంతేకాకుండా ప్రతి ఒక్కరూ నిత్యం చేతులను శుభ్రం చేసుకుంటూ, బయటకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించాలని సూచించాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూరి జగన్నాథ్ తెలుగులో “లైగర్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ మరియు బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని తెలుగు ప్రముఖ హీరోయిన్ “ఛార్మి” మరియు బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత “కరణ్ జోహార్” తదితరులు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతుండగా అనుకోకుండా కరుణ వైరస్ విజృంభిస్తున్న కారణంగా తాత్కాలికంగా కొంత కాలం పాటు వాయిదా వేశారు.