అంగారక గ్రహంపై నాసా హెలికాప్టర్ విజయవంతంగా ఎగురవేసిన విషయం విదితమే ప్రయోగం ఫలించడంతో యావత్ ప్రపంచం మొత్తం నాసా పై ప్రశంసల జల్లు కురిపిస్తోంది.ఇంటర్నేషనల్ మీడియా హెలికాప్టర్ ప్రయోగాన్ని ఆకాశానికి ఎత్తేసింది.
దాంతో అందరి ఫోకస్ సదరు హెలికాప్టర్ పై మళ్ళడంతో ఈ హెలికాప్టర్ ఎవరు రూపొందించారు అనే ఆసక్తి రేగింది.ఇంతకీ ఈ మినీ హెలికాప్టర్ తయారు చేసింది మన భారతీయుడేనన్న విషయం మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాలలోకి వెళ్తే.
బాబ్ బలరామ్ భారత సంతతికి చెందిన వ్యక్తీ.
మద్రాస్ ఐఐటి లో 1975-80 మధ్యలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు.తదనంతరం అమెరికాలోని అత్యంత ప్రతిష్టాత్మక రెన్ సీలర్ పాలిటెక్నిక్ రీసర్చ్ యూనివర్సిటీ లో ఏంఎస్ కంప్యూటర్స్ చేశారు.
అంతేకాదు అదే యూనివర్సిటీ నుంచీ పీహెచ్డీ కూడా అందుకున్నారు.ప్రస్తుతం నాసాలో మార్స్ హెలికాప్టర్ స్కౌట్ ప్రాజెక్ట్ కు చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న బలరామ్ అపోలో మూన్ ల్యాండింగ్ మిషన్ అంతరిక్షం, సైన్స్ లపై ఆసక్తి కలిగేలా చేసిందని అంటారు.

నాసాలో దాదాపు 20 ఏళ్ళుగా పనిచేస్తూ పలు విభాగాలలో సేవలు అందిస్తున్న బలరామ్ మార్స్ పై దిగే మినీ హెలికాప్టర్ రూపకల్పనపై కృషి చేస్తున్నానని తెలిపారు.తాజాగా మినీ హెలికాప్టర్ మార్స్ పై విజయవంతంగా ఎగరడంతో బలరామ్ కు మంచి క్రేజ్ రావడమే కాదు కొత్త ప్రాజెక్ట్స్ పై బిజీ బిజీ గా గడుపుతున్నారు.తాను సాధించింది చాలా తక్కువ అని భవిష్యత్తు లో మరిన్ని విజయాల కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు.బలరామ్ పేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది.భారత సంతతి వ్యక్తిగా ప్రశంసలు అందుకుంటున్న బలరామ్ తమ తోటి భారతీయుడు కావడం ఎంతో గర్వంగా ఉందని ప్రవాస భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.