ఎయిర్ హోస్టెస్ అంటే మర్యాదకు మారుపేరు.విమానం ఎక్కే ప్రయాణికులకుతో సేవలు చేస్తారు.
కానీ ఓ విమానంలో ఎయిర్ హోస్టెస్ మాత్రం విమానం ఎక్కిన ప్రయాణీకుల జంట ఆగ్రహంతో విమానం దిగిపోతే చక్కగా డ్యాన్స్ వేసింది.అంతేకాదు.
ఆమె డ్యాన్స్ చూసి మిగతా ప్రయాణీకుల చప్పట్లు కొట్టిన వింత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆమె డ్యాన్స్ ఎందుకు వేసిందీ? తోటి ప్రయాణీకులు ఎందుకు కేరింతలు కొట్టారో ఒక్కసారి చూద్దామా.
అయితే ఆ వీడియోలో విమానం ఎక్కిన ఓ జంటను మాస్కు పెట్టుకోవాలని ఎయిర్ హోస్టెస్ చెప్పింది.కానీ వారు వినలేదు.వారి మధ్య వాదన నడిచింది.ఈ క్రమంలోనే తోటి ప్రయాణికులు సదరు జంటపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాస్కు పెట్టుకోకపోతే వెంటనే విమానం దిగిపోవాలని గట్టిగా చెప్పారు.అందరూ అదే చెప్పటంతో చివరకు ఆ జంట విమానం దిగక తప్పలేదు.
ఇక దీంతో ఆ జంట విమానం దిగి వెళ్లిపోయినందుకు ఎయిర్ హోస్టెస్ సంబర పడతూ స్టెప్పులేసింది.తోటి ప్రయాణికులు కూడా చప్పట్లు చరుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ కూడా చూసేయండి.

ఇక కరోనా ప్రపంచ వ్యాప్తంగా అందరి జీవితాల్ని మార్చేసింది.మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరి అయిపోయింది.మాస్కులు లేకుండా ఎవరైనా కనబడితే మనసుల ఏమోలో చిన్న భయం మొదలవుతుంది.వెంటనే అటువంటి వారికి కాస్తంత దూరంగా జరిగిపోతాం.మనకు తెలియకుండానే.మరి విమానంలో ఇటువంటి వారు తారసపడితే.? మాస్కు పెట్టుకోబోమంటూ మొండికేస్తే.? ఆరోగ్యాలు ప్రమాదంలో పడిపోతాయనే భయం.
అదికాస్తా వేరే దేశాలకు పాకిపోయే ప్రమాదం జరిగే తీరుతుంది కదూ.ఇదిగో అలా మాస్కులు పెట్టుకోం అని వాదన పెట్టుకున్న జంట తాలూకు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ విడియోను తొలుత టిక్‌టాక్‌లో బ్రెండన్ ఎడ్లర్ అనే వ్యక్తి దీన్ని షేర్ చేయటంతో అదికాస్తా వైరల్ అయ్యింది.
ఈ వీడియో చూసిన వారంతా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.