బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు నాని.నాని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 13 సంవత్సరాలు కాగా ఈ 13 సంవత్సరాలలో నాని 25 సినిమాల్లో నటించారు.
ఈ 25 సినిమాల్లో ఎక్కువ సినిమాలు హిట్లు కావడం గమనార్హం.సినిమాసినిమాకు కథల ఎంపికలో, లుక్ లో వేరియేషన్ చూపించే నానికి కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.
సినిమాల్లో ఎక్కువగా పక్కింటి కుర్రాడి తరహా పాత్రలలో నటించే నాని సొంతూరు ఏపీలోని కృష్ణా జిల్లా చల్లపల్లి.చిన్నప్పటి నుంచే సినిమాలపై ఎంతో ఇష్టం ఉన్న నాని శ్రీకాంత్, స్నేహ ప్రధాన పాత్రల్లో నటించిన రాధాగోపాళం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.
అష్టాచమ్మా సినిమాతో హీరోగా కెరీర్ ను ప్రారంభించిన నాని అలా మొదలైంది, ఈగ, భలే భలే మగాడివోయ్ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సాధించారు.

ఒకవైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతగా పలు సినిమాలను నిర్మించి నాని తన అభిరుచిని చాటుకున్నారు.బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సెకండ్ సీజన్ 2కు నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.నాని తన అమ్మమ్మ చేసే చేపల పులుసును ఇష్టంగా తింటారు.2012 సంవత్సరంలో అంజనను నాని వివాహం చేసుకున్నారు.నాని, అంజన జంటకు 2017 సంవత్సరంలో అర్జున్ జన్మించారు.
తెలుగులో ఇప్పటికే సక్సెస్ అయిన హీరోలు కొంతమంది బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.కానీ నాని మాత్రం తెలుగులో మాత్రమే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
మల్టీస్టారర్ సినిమాలలో కూడా నటించడానికి నాని ఆసక్తి చూపుతున్నారు.ప్రస్తుతం నాని టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాలలో నటిస్తున్నారు.
టక్ జగదీష్ ఏప్రిల్ లో విడుదల కానుండగా ఈ ఏడాది సెకండాఫ్ లో శ్యామ్ సింగరాయ్ విడుదల కానుంది.